AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే..

ఒకప్పుడు సినిమాల్లో, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటుడు బాలాజీ. ఒకప్పుడు వరుస సినిమాలతో మెప్పించి ఆయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రఘువరన్-రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం వెల్లడించారు. అలాగే వారి వ్యక్తిగత జీవితంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రఘువరన్ డ్రగ్స్ వ్యసనం, కుమారుడిపై ప్రేమ, రోహిణి ధైర్యం, విడిపోయిన తర్వాత ఆమె ఆర్థిక కష్టాలు, పోరాటం గురించి వివరించారు.

Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే..
Raghuvaran, Rohini
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2026 | 11:32 AM

Share

టాలీవుడ్ నటుడు రఘువరన్, రోహిణి విడాకుల నేపథ్యం, వారి వ్యక్తిగత జీవితం, రఘువరన్ మరణం వెనుక గల కారణాలపై నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సంబంధాలను కలిపి ఉంచడంలో తాను నమ్ముతానని, విడదీయడాన్ని కాదని బాలాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “దారాన్ని తెంపడం చాలా సులభం, కానీ అతికించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ విషయంలో మహిళల పాత్ర, బాధ్యత చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రఘువరన్, రోహిణిల విడాకులు, విడిపోవడం కేవలం డ్రగ్స్ వ్యసనం వల్లేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నకు, రఘువరన్‌కు వ్యసనం ఉన్నప్పటికీ, తాను ప్రత్యక్షంగా చూడలేదని, ఇతరుల ద్వారా తెలిసిన విషయమని బాలాజీ స్పష్టం చేశారు. అయితే, రఘువరన్ విషయంలో రోహిణి ఇంకాస్త ఆలోచించి ఉంటే, ఆయన నేటికీ బ్రతికి ఉండేవారని బాలాజీ తెలిపారు. రఘువరన్ మరణానికి ప్రధాన కారణం తన కొడుకు దూరం అవ్వడమేనని బాలాజీ లోతైన కారణాన్ని వెల్లడించారు. “నా రక్తం, నా కొడుకు నా దగ్గర లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి?” అనే ఆలోచనతో రఘువరన్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

రఘువరన్ తన వ్యక్తిగత జీవితంలో చాలా మంచి వ్యక్తి అని, ఎదుటివారిని అమితంగా ప్రేమించేవాడని, తన దగ్గర ఉన్నదానిని పట్టించుకోడని, మంచి మనసున్న మనిషి అని బాలాజీ అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని, చనిపోయే సమయానికి ఆయన పరిస్థితి బాగా లేదని తెలిపారు. అయితే, ఈ కష్టసమయంలో రోహిణి వెనుకబడి నిలబడ్డారని, రఘువరన్ మరణానంతరం ఆయన ఆర్థిక బాధ్యతలను తనపై వేసుకుని, అన్నీ సరిదిద్దుకుని మళ్ళీ సున్నా నుండి తన జీవితాన్ని మొదలుపెట్టారని బాలాజీ వెల్లడించారు. రోహిణి చాలా ధైర్యవంతురాలని, దృఢమైన వ్యక్తి అని, ఆమె క్యారెక్టర్ సినిమాలలో లాగే నిజ జీవితంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని బాలాజీ చెప్పారు. ఆమె కష్టపడే స్వభావం, దృఢత్వం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

రఘువరన్ కుమారుడు ప్రస్తుతం యూఎస్ లో మెడిసిన్ చదువుతున్నాడని, రఘువరన్ లాగే పొడవుగా, అచ్చం ఆయన పోలికలతోనే ఉంటాడని బాలాజీ చెప్పారు. రఘువరన్‌కు తన కొడుకంటే చాలా ప్రేమ అని, ఆ ప్రేమ దూరం అవ్వడం వల్లే ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో బయటి ప్రపంచానికి తెలియదని, మనం బయటి నుండి ఎన్ని చెప్పినా, లోపల జరిగే వాస్తవాలు వేరని బాలాజీ వాస్తవిక దృక్పథాన్ని చూపించారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us