AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ హీరోయిన్‌తో చాలా కాలంగా రిలేషన్‌లో హనుమాన్ విలన్.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

చాలా మంది హీరోలు.. ఇప్పుడు విలన్ అవతరమెత్తి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా అలరించి ఆతర్వాత అవకాశాలు లేక లేదా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో విలన్స్ గా మారుతున్నారు. వారిలో వినయ్ రాయ్ ఒకరు. హనుమాన్ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు వినయ్ రాయ్.

టాలీవుడ్ హీరోయిన్‌తో చాలా కాలంగా రిలేషన్‌లో హనుమాన్ విలన్.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Vinay Rai
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2025 | 9:38 AM

Share

చాలా మంది హీరోలు విలన్స్ గా మారి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అదేంటో హీరోలుగా రాని ఇమేజ్ ను విలన్స్ గా సాదించుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు విలన్స్ గ క్లిక్ అయ్యారు. ఈ మధ్య హీరోల కంటే ఆ సినిమాల్లో నటించిన విలన్స్ కే క్రేజ్ పెరుగుతుంది. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న విలన్ ఒకరు. ఆ స్టైలిష్ విలన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు హీరోగా సూపర్ సినిమాల్లో నటించి మెప్పించాడు.. ఆయనే వినయ్ రాయ్. 2007లో వచ్చిన నీవల్లే నీవల్లే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వినయ్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. నీవల్లే నీవల్లే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వాన సినిమాలో నటించాడు. వాన సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఆతర్వాత తమిళ్ లోనే వరుసగా సినిమాలు చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ డాక్టర్‌ అనే సినిమాతో విలన్ గా నటించి మెప్పించారు. వరుణ్‌ డాక్టర్‌ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్నాడు వినయ్ రాయ్. ఇదిలా ఉంటే ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఆమె మన టాలీవుడ్ హీరోయిన్. వినయ్ రాయ్ విమలా రామన్ తో డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ తెగ ఫోటోలు షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్.

ఇవి కూడా చదవండి

మలయాళంలో ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో ఎవరైనా ఎప్పుడేనా, జగపతి బాబుతో ‘గాయం 2’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది. అలాగే నువ్వా నేనా సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో కనిపించింది. ఇదిలా ఉంటే విమలా రామన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. రుద్రాంగి, గాండీవ దారి అర్జున సినిమాలో కనిపించింది. గాండీవదారి అర్జున్ సినిమాలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్య భర్తలుగా నటించారు. ఈ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసున్నా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Vimala Raman (@vimraman)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.