UPSC Civils Free Coaching 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్.. జూన్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌స్ పరీక్షలకు (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) లాంగ్‌టర్మ్‌కోచింగ్ 2026కు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన జారీ చేశారు. సివిల్స్ తరగతులను జూలై 27 నుంచి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల..

హైదరాబాద్, జూన్ 14: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌స్ పరీక్షలకు (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) లాంగ్‌టర్మ్‌కోచింగ్ 2026కు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన జారీ చేశారు. సివిల్స్ తరగతులను జూలై 27 నుంచి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మీనగర్‌కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం 150 మందికి కోచింగ్ ఇస్తామని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూలై 12న ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 100 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. మరో 50 మంది అభ్యర్థులను గతంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తామని వివరించారు.
ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రవేశం పొందిన అభ్యర్థులకు వసతి, రవాణా కోసం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తామని, రూ.5 వేలు బుక్‌ఫండ్ ఒక్కసారి మాత్రమే అందజేస్తామని వెల్లడించారు. గ్రంథాలయ సదుపాయం ఉంటుందని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉచిత తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులను జూన్ 16 నుంచి జూలై 7, 2025 వరకు ఆన్‌లైన్ విధారంలో అప్లై చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు 040-24071178 ఫోన్ నంబరును సంప్రదించవచ్చని సూచించారు.
DEET యువతకు భారీగా ఉద్యోగావకాశాలు..
తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్)’ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని డీట్ సంచాలకుడు జె.రాజేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డీట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఐటీ, ఫార్మా, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర రంగాల్లో మొత్తం 10,080 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.