AP 10th Supply Results 2025: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా.. చివరి స్థానంలో గోదారోళ్లు!
రాష్ట్ర వ్యాప్తంగా మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి 2025 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో 76.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,23,477 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 94,017 మంది ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ..

అమరావతి, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి 2025 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో 76.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,23,477 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 94,017 మంది ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. తాజా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 98.24 శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో నిలిచింది. ఇక 50.24 శాతంతో పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాలని విద్యార్ధులకు సూచించారు.
మరోవైపు సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షల్లో 66.76 శాతం, ఇంటర్మీడియట్‌లో 66.73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షలకు 15,422 మంది హాజరుకాగా.. ఇందులో 10,296 మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు 27,123 మంది రాయగా.. వీరిలో 18,099 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూన్ 16 నుంచి 25లోపు దరఖాస్తు చేసుకోవాలని సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ నరసింహారావు తెలిపారు.
ఏపీ పీజీసెట్ 2025 ఆన్సర్ కీ విడుదల.. జూన్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్, మొబైల్ నంబర్ నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్16వ తేదీ వరకు తెలుపవచ్చని పేర్కొంది. కాగా జూన్ 9 నుంచి 12 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
ఏపీ పీజీసెట్ 2025 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.