APPSC JL 2025 Revised Dates: ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ కొత్త పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఇంతకీ ఎప్పట్నుంచంటే?
రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో ఏపీపీఎస్సీ పలు రాత పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డీఎస్పీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభంకాగా జూన్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ తేదీల్లో జరగవల్సిన ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలను వాయిదా వేస్తూ గతంలో ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది...

అమరావతి, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో ఏపీపీఎస్సీ పలు రాత పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డీఎస్పీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభంకాగా జూన్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ తేదీల్లో జరగవల్సిన ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలను వాయిదా వేస్తూ గతంలో ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది.
ఈ పరీక్షలు రాసేవారిలో కొందరు డీఎస్సీకి కూడా సన్నద్ధమవుతున్నందున కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అన్ని పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక పరంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఏపీపీఎస్సీ ఆయా పరీక్షలను వాయిదా వేసింది. తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజా బాబు అప్పట్లో తెలిపారు.
ఈ క్రమంలో తాజాగా పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్-2023 నోటిఫికేషన్‌కు సంబంధించిన కొత్త పరీక్ష షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్షలను జులై 15, 2025 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నిజానికి తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహించాలని షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ తేదీల్లో జరగవల్సిన పరీక్షలు జూలై 15 నుంచి ప్రారంభకానున్నాయి.
ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ 2025 పరీక్షల కొత్త షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.