ఈ చెట్టు కనిపిస్తే అస్సలు వదలకండి..నయంకాని రోగాలకు దివ్యౌషధం!

August 05

Jyothi Gadda

నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది: తుమ్మ చెట్టు పుల్లలతో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వాపు, రక్తం కారడం, నోటి దుర్వాసన తగ్గి దంతాలు దృఢంగా, శుభ్రంగా మారతాయి.

యాంటీ బాక్టీరియల్ గుణాలు: తుమ్మ చెట్టు బెరడు, జిగురులో ఉండే సహజ క్రిమిసంహారక గుణాలు శరీరంలో చేరే హానికర బ్యాక్టీరియాలను నశింపజేసి వ్యాధుల నుంచి కాపాడతాయి.

డయాబెటిస్ నియంత్రణ: తుమ్మ బెరడు పొడి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

చర్మ సమస్యలకు నివారణ: తుమ్మ ఆకుల పేస్ట్ లేదా రసం రాసుకోవడం వల్ల చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, ఎగ్జిమా, గాయాలు త్వరగా నయమవుతాయి.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: తుమ్మ జిగురును లడ్డూల రూపంలో లేదా ఆహారంతో తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారి, మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల నొప్పుల తీవ్రత తగ్గుతుంది.

శ్వాసకోస సమస్యల నివారణ: తుమ్మ బెరడు కషాయం తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాసనాళాల్లో ఉండే కఫం సులభంగా బయటకు వెళ్లిపోతుంది.

రోగనిరోధక శక్తి పెంపు: ఇందులో లభించే ఆంటీఆక్సిడెంట్లు, ముఖ్య పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.

బరువు తగ్గడానికి సహాయం: తుమ్మ జిగురులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగి, ఆకలి తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణకు దోహదపడుతుంది.

గాయాలు త్వరగా మానడం: తుమ్మ ఆకుల లేదా బెరడు కషాయంతో గాయాలను కడగడం వల్ల రక్తం గడ్డకట్టి, గాయాలు ఇన్ఫెక్షన్ పడకుండా వేగంగా మానిపోతాయి.