AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంప ముంచిన SBI క్రెడిట్‌ స్కోర్.. చేతికందిన బ్యాంకు ఉద్యోగం హుష్‌..! కోర్టు షాకింగ్ ట్విస్ట్..

బ్యాంకింగ్‌ ఉద్యోగార్ధులకు క్రెడిట్ కార్డు హిస్టరీ గండంగా మారింది. పేలవమైన క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి నిర్మొహమాటంగా ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పూర్ క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి ఉద్యోగం ఉచ్చేందుకు నిరాకరించింది. ఎస్బీఐ నిర్ణయాన్ని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్థించడం విశేషం. ఉద్యోగార్థులకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ తీర్పు స్పష్టం చేసింది..

కొంప ముంచిన SBI క్రెడిట్‌ స్కోర్.. చేతికందిన బ్యాంకు ఉద్యోగం హుష్‌..! కోర్టు షాకింగ్ ట్విస్ట్..
SBI job rejection over poor credit score
Srilakshmi C
|

Updated on: Jul 03, 2025 | 2:59 PM

Share

క్లీన్ క్రెడిట్ రికార్డ్, అధిక క్రెడిట్ స్కోరు, స్థిరమైన తిరిగి చెల్లింపులు ఆర్థిక రంగంలో ఒక అవసరం మాత్రమే. కానీ ఉద్యోగ అభ్యర్ధులకు మాత్రం సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్) అత్యవసరం. సక్రమంగాలేని చెల్లింపులు, రుణ డిఫాల్ట్‌ల కారణంగా ఓ వ్యక్తి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) నియామకాన్ని ఎస్బీఐ రద్దు చేయడాన్ని కోర్టు సమర్థించింది. ప్రజా ధనాన్ని నిర్వహించే ఉద్యోగులు ఆరోగ్యకరమైన క్రెడిట్ పద్ధతులను నిష్కళంకమైన ఆర్థిక క్రమశిక్షణను ప్రదర్శించాలని జస్టిస్ ఎన్ మాల తీర్పు సందర్భంగా నొక్కి చెప్పారు. పేలవమైన క్రెడిట్ రికార్డులు, ప్రతికూల క్రెడిట్ స్కోర్‌ కలిగిన వారిని బ్యాంకు ఉద్యోగాలకు అనర్హులుగా తేల్చుతున్నాయి. ఇది దరఖాస్తు చేసుకునే ముందు చెక్‌ చేయవల్సిన ప్రమాణమని కోర్టు అభిప్రాయపడింది.

దరఖాస్తుదారునికి 2018-19 నుంచి మూడు వ్యక్తిగత రుణాలు, గడువు ముగిసిన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ వివరాలు వెల్లడయ్యాయి. దరఖాస్తు సమర్పించే ముందు ఈ బకాయిలను క్లియర్ చేసినప్పటికీ, ఈ పాలసీకి రుణ క్లియరెన్స్ మాత్రమే కాకుండా సకాలంలో వ్యక్తిగత రుణ చెల్లింపుల క్లీన్ ట్రాక్ రికార్డ్ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రాథమికంగా రెండు కీలకమైన అంశాలను చెబుతుంది. మొదటిది ఉద్యోగ దరఖాస్తుదారులు ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రాథమిక అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి నియంత్రిత రంగాలలో దరఖాస్తు చేసుకునే ముందు ప్రమాణాలను జాగ్రత్తగా సమీక్షించవల్సి ఉంటుంది.

రెండవది అధిక క్రెడిట్ స్కోరుతో పాటు బలమైన క్రెడిట్ హిస్టరీ కూడా మెయిన్‌టైన్‌ చేయాలి. ఎందుకంటే ఇది సంబంధిత అభ్యర్ధిక క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. ఈ కేసులో 2003 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే నియమించాలని పునరుద్ఘాటిస్తుంది. ప్రభుత్వ సంస్థల సమగ్రతను కాపాడడంలో ఇది సహాకరిస్తుందని తేల్చిచెప్పింది. బ్యాంకర్లు, CAలు, CFAలు, ఇతర ఫైనాన్స్ సంబంధిత కెరీర్‌లను ఎంచుకునే వారికి క్రెడిట్ క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తాజా కేసు ఓ గుణపాఠం వంటిది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారు గుర్తుంచుకోవలసిన 5 ముఖ్య విషయాలు ఇవే

  • ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు ప్రాథమిక అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
  • క్లీన్ క్రెడిట్ ప్రొఫైల్ మెయింటైన్‌ చేయాలి.
  • కేవలం దరఖాస్తు చేసుకునే ముందు పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడం, చెల్లింపులు చేయడం వల్ల స్థిరమైన ట్రాక్ రికార్డ్‌ సాధ్యం కాదు.
  • మొత్తం నియామక ప్రక్రియ సమయంలో ఆర్థిక వివరాలు, ఇతర సంబంధిత డేటాను దాచడం వల్ల అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది.
  • ఆరోగ్యకరమైన క్రెడిట్ ప్రొఫైల్, బలమైన క్రెడిట్ స్కోరు నిర్వహించడం చాలా ముఖ్యం.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.