AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2025: రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు..

RRB Railway Jobs 2025: రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌.. ఇంటర్‌ పాసైతే చాలు! సికింద్రాబాద్‌లో పోస్టులున్నాయంటే..
RRB Railway Technician Jobs
Srilakshmi C
|

Updated on: Jul 02, 2025 | 3:53 PM

Share

దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పలు విభాగాల్లో టెక్నీషియన్ గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 3 పోస్టులకు ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 6,238 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 6,055 వరకు ఉన్నాయి. ఈ పోస్టులను సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్లలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్‌లో పోస్టులు: 174
  • ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్‌లో పోస్టులు: 139
  • ఆర్‌ఆర్‌బీ బెంగళూరులో పోస్టులు: 140
  • ఆర్‌ఆర్‌బీ భోపాల్‌లో పోస్టులు: 210
  • ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్‌లో పోస్టులు: 38
  • ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్‌లో పోస్టులు: 71
  • ఆర్‌ఆర్‌బీ చండీగఢ్‌లో పోస్టులు: 446
  • ఆర్‌ఆర్‌బీ చెన్నైలో పోస్టులు: 1,347
  • ఆర్‌ఆర్‌బీ గువాహటిలో పోస్టులు: 184
  • ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్‌లో పోస్టులు: 296
  • ఆర్‌ఆర్‌బీ కోల్‌కతాలో పోస్టులు: 1,434
  • ఆర్‌ఆర్‌బీ మాల్దాలో పోస్టులు: 70
  • ఆర్‌ఆర్‌బీ ముంబయిలో పోస్టులు: 891
  • ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్‌లో పోస్టులు: 02
  • ఆర్‌ఆర్‌బీ పట్నాలో పోస్టులు: 07
  • ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్‌లో పోస్టులు: 239
  • ఆర్‌ఆర్‌బీ రాంచీలో పోస్టులు: 35
  • ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌లో పోస్టులు: 113
  • ఆర్‌ఆర్‌బీ సిలిగురిలో పోస్టులు: 133
  • ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురంలో పోస్టులు: 197
  • ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పుర్‌లో పోస్టులు: 68

టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌ లేదా ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ లేదా ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ మెకానిక్/ మెకానిక్ మెకాట్రానిక్స్‌/ మెకానిక్ డీజిల్‌/ మెకానిక్ మోటార్ వెహికిల్/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణలై ఉండాలి. వయోపరిమితి కింద జులై 1, 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితితో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జులై 28, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.500 వరకు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు రూ.19,900 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 28, 2025 నుంచి
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2025.
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జులై 30, 2025.
  • దరఖాస్తు సవరణకు తేదీలు: ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు

ఆర్‌ఆర్‌బీ రైల్వే టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..