స్కూల్ విద్యార్ధినిపై కీచక ఉపాధ్యాయుడి నీచత్వం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు! ఎక్కడంటే..
విద్యార్థినుల పట్ల ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన బడి ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదేమని ప్రశ్నించిన విద్యార్ధుల తల్లిదండ్రులతో రెట్టింపు నీచంగా మాట్లాడాడు. మీ పట్ల అలా వ్యవహరించనందుకు సంతోషించమంటూ... వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వారిపట్ల మరింత దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు..

నెల్లూరు, జులై 1: భావితరానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు… విద్యార్థినుల పట్ల కీచకుడిగా మారాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన బడి ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదేమని ప్రశ్నించిన విద్యార్ధుల తల్లిదండ్రులతో రెట్టింపు నీచంగా మాట్లాడాడు. మీ పట్ల అలా వ్యవహరించనందుకు సంతోషించమంటూ… వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వారిపట్ల మరింత దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి పాఠశాలలోనే దేహశుద్ధి చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కీచకుడైన ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులంతా ఏకం కావడంతో అక్కడ నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు, బాధితులు తెలిపిన సమాచారం మేరకు..
వరికుంటపాడు మండలంలోని తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లోకసాని వెంగయ్య అనే ఉపాధ్యాయుడు ఇటీవల ఓ గిరిజన విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు ఇదేమని ప్రశ్నించడంతో ఎదురు తిరగడమే గాక… ఇనుప రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తనతో పెట్టుకుంటే అంతం చూస్తానంటూ హెచ్చరికలు చేశాడు. దీంతో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమై కామాంధుడైన ఉపాధ్యాయుడు వెంకయ్యకు దేహశుద్ధి చేశారు. గ్రామస్తులు, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు రాడ్డుతో దాడి చేసిన క్రమంలో జరిగిన పరస్పర కొట్లాటలో ఉపాధ్యాయుడి కారు కూడా ధ్వంసమైంది. దీంతో ఉపాధ్యాయుడు పాఠశాలల గోడదూకి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ… కీచకుడుగా మారిన వెంగయ్యను వరికుంటపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై విచారణ చేస్తున్నట్లు వరికుంటపాడు పోలీసులు తెలిపారు.
బుద్ధిగా విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు వెంగయ్యపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. తరచూ స్కూల్‌కి ఎగనామం పెట్టడం, ఇదేమని మండల స్థాయి స్థానిక హెచ్ఎం స్థాయి అధికారులు ప్రశ్నిస్తే వారిపై కుల దోషణ కేసులు పెడతామంటూ బెదిరించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని కొందరు ఉపాధ్యాయులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న తూర్పు బోయమడుగుల పాఠశాలలోనూ ఓ విద్యార్థి పట్ల అసభ్యకరంగా అనుచితంగా తరచుగా ప్రవర్తిస్తుండడంతో ప్రశ్నించేందుకు వచ్చిన తోటి తల్లిదండ్రుల పట్ల దురుసుగా మాట్లాడుతూ, రాడ్డుతో దాడి చేయబోగా తల్లిదండ్రులు ఎదురుదాడి చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




