AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్‌.. రోడ్లపైకి మినీ బస్సులు..!

Telangana: సెట్విన్‌ తరహా మినీ బస్సులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి తీసుకువచ్చి క్యూర్‌ పరిధిలో ఆర్టీసీ సేవలు మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతంలో చార్మినార్‌ ప్రాంతంలో 100 మినీ బస్సులు నడిపిన ఆర్టీసీ అవి పాతబడటంతో వాటిని అధికారులు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం భారీ ప్లాన్‌.. రోడ్లపైకి మినీ బస్సులు..!
Tg Rtc
Subhash Goud
|

Updated on: Aug 05, 2026 | 10:48 AM

Share

Telangana: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ఆర్టిసీ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక హైదరాబాద్‌ వాసులకు ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్‌ సమస్యతో సతమవుతున్న నేపథ్యంలో సులభంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేందుకు శివారు ప్రాంతాల్లో ఫీడర్‌ సర్వీసులు నడుపాలని ప్రభుత్వం భావిస్తోంది.

సెట్విన్‌ తరహా మినీ బస్సులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి తీసుకువచ్చి క్యూర్‌ పరిధిలో ఆర్టీసీ సేవలు మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతంలో చార్మినార్‌ ప్రాంతంలో 100 మినీ బస్సులు నడిపిన ఆర్టీసీ అవి పాతబడటంతో స్ర్కాప్‌ కింద తొలగించింది. దీంతో కొత్తగా మొదటి దశలో 100 మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మినీ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతగానో మేలు జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us