AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ECET 2025 Counselling Schedule: బీటెక్‌ 2nd ఇయర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం జులై 4 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్‌ గణేష్‌కుమార్‌ తెలిపారు..

AP ECET 2025 Counselling Schedule: బీటెక్‌ 2nd ఇయర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?
ECET Counselling
Srilakshmi C
|

Updated on: Jul 02, 2025 | 5:41 PM

Share

అమరావతి, జులై 2: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం జులై 4 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్‌ గణేష్‌కుమార్‌ తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులు జులై 4 నుంచ 8 వరకు ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. అలాగే జులై 4 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల ఆప్‌లోడ్ కూడా చేయవల్సి ఉంటుంది.

ఇక జులై 7 నుంచి 10 వరకు కాలేజీలు, కోర్సుల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల ఎంపిక చేయవల్సి ఉంటుంది. జులై 11న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తారు. జులై 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు 14 నుంచి 17లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక జులై 14 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. కాగా డిప్లొమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు మే 6వ తేదీన ఈ సెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మొత్తం 35,187 మంది హాజరవగా అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు.

సీయూఈటీ యూజీ 2025 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల

వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌ (సీయూఈటీ 2025) పరీక్ష తుది కీ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ప్రశ్న ఐడీతో కీను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 13 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ యూజీ 2025 ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే