Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌‌కు బిగ్ షాక్‌.. చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు.. కారణం ఇదే

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌‌కు బిగ్ షాక్‌.. చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు.. కారణం ఇదే
Saif Ali Khan
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2025 | 3:09 PM

Share

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సైఫ్‌ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. దీంతో సైఫ్‌ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది.

భోపాల్‌లో సైఫ్‌ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్‌ నుంచి పలు రాజభవనాలు వారసత్వంగా వచ్చాయి. భోపాల్‌ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ కుమార్తె సాజిదా. ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్‌ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖర్‌ అలీఖాన్‌ ను పెళ్లాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్‌ కుటుంబానికి దక్కాయి.

అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్‌కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్‌ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్‌ కుటుంబసభ్యులు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ పలు కీలక ఆదేశాలిచ్చింది.

ఈ వివాదం 2014లో మొదలైంది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ నోటీసు నుండి వచ్చింది.. ఇది పటౌడి కుటుంబ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది.. వాటిని విదేశీ పౌరుడి ఆస్తులుగా.. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉంటుందని ప్రకటించింది. ఇటీవలి పరిణామాలలో, మధ్యప్రదేశ్ హిఫ్ కోర్టు స్థానిక ట్రయల్ కోర్టు 25 ఏళ్ల నాటి తీర్పును రద్దు చేసి, కేసును పూర్తిగా తిరిగి విచారించాలని ఆదేశించింది. కోర్టు తాజా ఆదేశం ప్రకారం ఈ విషయాన్ని ప్రారంభం నుండి పునఃపరిశీలించాలని, ట్రయల్ కోర్టుకు ఒక సంవత్సరం లోపు విచారణను ముగించాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి