IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
IND vs PAK Possible Final Date Time: టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. అయితే, అటు పాకిస్తాన్, ఇటు భారత జట్టు సెమీస్ స్థానం కోసం డూ ఆర్ డై మ్యాచ్‌లో తలపనున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్లు సెమీస్‌కు క్వాలిఫై అయితే, మరోాసారి ఈ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగే ఛాన్స్ ఉంది.

IND vs PAK Possible Final Date Time: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. సూపర్-8 దశ ముగింపు దశలో ఉండగా, గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా, గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం భారత్, పాకిస్థాన్ సహా నాలుగు జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఈ సమీకరణాలు భారత్–పాకిస్థాన్‌కు అనుకూలంగా మారితే, అభిమానులు మరోసారి హై-వోల్టేజ్ ఇండియా vs పాక్ మ్యాచ్‌ను చూసే అవకాశం ఉంది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం, రెండు జట్లు ఫైనల్‌లో తలపడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆ మహా పోరుకు సంబంధించిన తేదీ, సమయంపై కూడా చర్చలు మొదలయ్యాయి.
మళ్లీ భారత్ vs పాకిస్థాన్ పోరు..
సూపర్-8 దశ తర్వాత సెమీఫైనల్ ఫిక్చర్ దాదాపు స్పష్టమైంది. భారత్, పాకిస్థాన్ రెండూ తమ తమ సెమీఫైనల్ మ్యాచ్‌లను గెలిస్తే, ఫైనల్‌లో మరోసారి ఇండియా–పాక్ క్లాష్ చూడొచ్చు.
సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో, భారత్, ఇంగ్లాండ్‌తో తలపడే అవకాశముంది. ఈ రెండు జట్లు గెలిస్తే, టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద పోరుగా మారుతుంది. టైటిల్ కోసం భారత్–పాకిస్థాన్ తలపడే అవకాశం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
భారత్ సెమీఫైనల్ సమీకరణం..
సూపర్-8 దశలో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత్, జింబాబ్వేపై ఘన విజయం సాధించి తిరిగి పోటీలోకి వచ్చింది.
ఇక వెస్టిండీస్ జింబాబ్వేపై గెలిచినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అందువల్ల మార్చి 1న కోల్‌కతాలో జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా మారింది.
ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
పాకిస్థాన్ సెమీఫైనల్ సమీకరణం..
పాకిస్థాన్ ప్రయాణం సూపర్-8లో మిశ్రమంగా సాగింది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి, ఒక్కో పాయింట్ లభించింది. తరువాత ఇంగ్లాండ్ చేతిలో ఓటమి ఎదురైంది.
అయితే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ను ఓడించడంతో పాకిస్థాన్ ఆశలు మళ్లీ సజీవమయ్యాయి. ఇప్పుడు శ్రీలంకతో జరిగే మ్యాచ్ కీలకం.
సమీకరణ ఇలా ఉంది:
పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే – కనీసం 65 పరుగుల తేడాతో గెలవాలి.
లక్ష్యాన్ని ఛేజ్ చేస్తే – 13 ఓవర్లలోపు మ్యాచ్ ముగించాలి.
అంటే, పాకిస్థాన్‌కు కేవలం గెలుపు సరిపోదు. భారీ విజయం సాధించాల్సిందే.
ఈ పరిస్థితుల్లో టీ20 వరల్డ్ కప్ 2026 మరోసారి ఇండియా–పాక్ క్లాసిక్‌కు వేదిక కావొచ్చు. అభిమానులు ఇప్పుడు సెమీఫైనల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
