Rottela Panduga 2025: నెల్లూర్ రొట్టెల పండుగకు సర్వం సిద్ధం.. రేపట్నుంచే స్వర్ణాల చెరువులో వేడుకలు!
నెల్లూరులో ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు..

నెల్లూరు, జులై 5: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటా మోహరం సందర్భంగా రోజు రొట్టెల పండుగను నిర్వహిస్తారు. రేపటి నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. దీంతో ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేశారు. ఒకరోజు ముందు నుంచే భక్తుల సందడి మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు బారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులు కునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచి నీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
కోర్కెలు తీర్చే రొట్టెలు..
ఇక్కడ పలు రకాల రొట్టెలు పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక రకాల రొట్టెలు ఉంటాయి.. ఏ కోర్కె కోరుకుంటే ఆరొట్టె తీసికుంటారు.. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి ఇదే రొట్టెను చెల్లిస్తారు.. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. ఇదే రొట్టెల పండుగ పద్ధతి.
బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేయాలని అన్నారు. దర్గాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వసతులను మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. నిత్యం అధికారులు తనికీలు వుంటాయని ఎవరికి కేటాయించిన విభాగాల్లో వారు పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.