AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

Coconut Water Vs Buttermilk: భానుడు భగభగలాడుతున్నాడు. ఎండలు ముదురుతున్న కొద్దీ మన శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏసీ గదుల్లో ఉండేవారు కూడా తమ హైడ్రేషన్ లెవల్స్‌ను కాపాడుకోవడం అత్యవసరం. అయితే దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ వైపు కాకుండా మన సాంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, మజ్జిగ వైపు మొగ్గు చూపాలని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Mar 15, 2026 | 7:30 AM

Share
ఏవియేషన్, స్పేస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ జర్నల్ ప్రకారం.. మనం ఎంత ఎక్కువ సేపు ఎండలో గడుపుతామో, దానికి దామాషా ప్రకారం హైడ్రేటింగ్ డ్రింక్స్ తీసుకోవాలి. రోజుకు కనీసం మూడుసార్లు ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల వేడిని సమర్థవంతంగా అధిగమించవచ్చని నిరూపితమైంది.

1 / 5
కొబ్బరి నీళ్లలో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఎండలో తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమం. ఇది శరీరానికి వెంటనే ఎలక్ట్రోలైట్లను అందించి, నీరసాన్ని తగ్గిస్తుంది. ప్యాక్ చేసిన డ్రింక్స్ కాకుండా, పచ్చి కొబ్బరి నుండి తీసిన తాజా నీటిని తాగితేనే పూర్తి లాభం ఉంటుంది.

2 / 5
మజ్జిగ: మజ్జిగ మన సంప్రదాయ పానీయం. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపుని చల్లబరుస్తుంది. భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం చాలా మంచిది. ఇది తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3 / 5
మజ్జిక తాగేటప్పుడు దానిలో కొన్ని యాడ్ చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్యమూ పెరుగుతుంది. చక్కెర కలిపిన లస్సీ కంటే పల్చటి మజ్జిగే వేసవికి బెస్ట్.

4 / 5
నిపుణులు ఏమంటున్నారు: కేవలం ఏదో ఒకటి మాత్రమే తాగడం కంటే.. ఉదయం పూట కొబ్బరి నీళ్లు, మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. కృత్రిమ రంగులు, చక్కెర ఉండే సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండి.. ఈ ప్రకృతి సిద్ధమైన పానీయాలను అలవాటు చేసుకుంటే ఈ వేసవిని హాయిగా దాటవచ్చు.

5 / 5
Follow Us
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి

కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!

ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్

ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!

మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!

కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు

రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస

మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!