Andhra: అరెరే.! ఇదేదో భలేగుందే.. అరకు లోయలో సింహం పోలికలతో కుక్క.. చూస్తే స్టన్
అరకు లోయ.. తెలుగు రాష్ట్రాలలోని పర్యాటకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ లోయను సందర్శిస్తారు. వీకెండ్ వస్తే చాలు.. అక్కడికి వచ్చేసి.. తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక అక్కడ వారికి ఓ అనుకోని అతిధి పరిచయం అయింది. అదేంటంటే ఇలా..

ప్రకృతి సహజ సిద్ధాంతాలకు కేరాఫ్ అడ్రస్ అరకు లోయ. వీకెండ్ కావడంతో పర్యాటకులు భారీగానే వచ్చారు.. ఎంజాయ్ లో సందడి చేస్తూ ఉన్నారు.. ఈ లోగానే ఒక్కసారిగా అనుకోని అతిధి ఆ ప్రాంతంలో కనిపించింది.. తాను కూడా సరదాగా అరకు టూర్ ట్రిప్ వేసింది. ఒక్కసారిగా కనిపించిన అనుకోని అతిధిని చూసేందుకు పర్యాటకులు పరుగులు తీశారు.. సింహం లాంటి ఆ అతిథితో సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. కొంతమంది కాస్త భయపడినా.. ఎంచక్కా షేక్ హ్యాండ్ ఇస్తూ ఆప్యాయతగా పలకరించారు.. పర్యటకుల ఆప్యాయతకు ఆ అతిథి కూడా ఫిదా అయిపోయింది. వారితో సరదాగా సెల్ఫీలకు ఫోజిచ్చింది.
ఎస్..! ఆ అతిథి ఎవరో కాదు టిబెటన్ మస్తీఫ్. సింహాన్ని పోలిన ఓ శునకం. తన యజమానితో పాటు సరదాగా షికారుకు వచ్చింది. అరకు లోయలో అటు ఇటు తిరుగుతూ సందడి చేసింది. యజమాని జీపు పైనుంచి అందరినీ పలకరించింది. ఒక్కానొక సమయంలో ఆ సునకాన్ని చూసిన జనం.. అది సింహం పిల్ల అయి ఉంటుందని భయపడ్డారు. కానీ అది శునకం అని తెలుసుకుని దగ్గరకు వెళ్లి విష్ చేశారు. సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. తనను చూసేందుకు ఆప్యాయంగా వచ్చిన పర్యాటకుల కోసం కూడా ఆ సునకం సరదాగా సెల్ఫీలకు ఫోజిచ్చింది. ఆ సునకం పేరు ‘మస్తీఫ్ సుల్తాన్’. విశాఖకు చెందిన ఇషాక్ మదీనా వలి అనే వ్యక్తి మస్తీఫ్ సుల్తాన్ ను పెంచుకుంటూ ఉన్నాడు. అరకు పర్యటనలో భాగంగా తన ఓపెన్ టాప్ జీపులో వచ్చాడు. తనతోపాటు మస్తీఫ్ ను కూడా తీసుకొచ్చాడు. కూల్ క్లైమేట్ లో యజమాని విశాఖ మదీనా వలితో కలిసి అరకు లోయలో పర్యటించింది మస్తీఫ్ సుల్తాన్. అరకు లోయ పర్యాటక అందాలను ఆస్వాదిస్తూ కూల్ క్లైమేట్ లో ఎంజాయ్ చేసింది. తనను మెచ్చుకుంటూ తనకోసం వచ్చిన పర్యాటకులతో సరదాగా గడిపింది మస్తీఫ్ సుల్తాన్.
అది మామూలు శునకం కాదు..
టిబిటన్ మస్తీఫ్ అనేది హిమాలయాలు, టిబెటన్ పీఠభూమిలో పెరిగే ఒక పెద్ద కుక్క జాతి. చాలా బలంగా ఉంటుంది. ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందో.. అవసరమైతే ఆ స్థాయిలో విరుచుకుపడుతుంది. దూకుడు స్వభావం కలది. ఇటువంటి కుక్కలను మందలను కాపాడేందుకు సాధారణంగా చాలా చోట్ల పెంచుకుంటూ ఉంటారు. ఈ కుక్కలు చాలా తెలివైనవి. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందుకే వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ఉంటారు. పరిమాణం పెద్దదిగాను.. చూసేందుకు సింహంలా కనిపిస్తుంది. ఎందుకంటే శరీరంతో పాటు ప్రధానంగా శిరస్సుపై మందపాటి వెంట్రుకలను కలిగి ఉంటుంది. బలమైన రక్షణ ప్రవృత్తిని కలిగి ఉంటాయి. స్వతంత్రంగా మొండిగా ఉండే స్వభావం ఉన్నప్పటికీ కాస్త శిక్షణ ఇస్తే విశ్వాసపాత్రుడుగా అంకితభావంతో పనిచేస్తాయి. దాని బరువు 90 నుంచి 150 పౌండ్ల వరకు ఉంటుంది. కండరాలు దృఢంగా బలంగా ఉంటాయి. శక్తివంతమైన దవడలతో తనకు తాను రక్షించుకోవడంతోపాటు.. కాపలా చేసే క్రమంలో శత్రువుల నుంచి కాపాడేందుకు కీలకంగా ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..