AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌… అక్టోబర్‌ 2లోగా భూ సమస్యల పరిష్కారం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌. ఆధార్‌, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో వారసత్వ భూములకు...

Andhra Pradesh: రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌... అక్టోబర్‌ 2లోగా భూ సమస్యల పరిష్కారం
Chandrababu Review On Lands
K Sammaiah
|

Updated on: Jul 07, 2025 | 1:13 PM

Share

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌. ఆధార్‌, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్‌ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

రూ. 10లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని సూచించారు. ఫ్రీ హోల్డ్ భూములు, రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూ సంస్కరణల పై సమీక్ష నిర్వహించారు భూసమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు. రెవెన్యూ శాఖలో మార్పులు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెవెన్యూ యంత్రాంగంలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది.

ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సమీక్షలో నిర్ణయించారు. క్యూఆర్‌ కోడ్‌ ఉండే పాస్‌ పుస్తకాలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు వివిధ రకాల భూములకు… రంగుల పాస్‌బుక్కులు కేటాయించాలని నిర్ణయించారు ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ఇక 2027 డిసెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి పేదవాడికి నివాసయోగ్యమైన ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అనగాని. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించామని అనగాని తెలిపారు.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..