Viral: వ్యక్తికి ఆగకుండా రక్తపు వాంతులు, వికారం.. టెస్టులు చేయగా.. ఎక్స్‌రేలో
ఆ వ్యక్తి 5 సంవత్సరాల్లో 5సార్లు ఆస్పత్రికి వెళ్లాడు. తీవ్రమైన కడుపునొప్పి, రక్తపు వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నాడు. కట్ చేస్తే.! డాక్టర్లు టెస్టులు చేసి.. ఎక్స్‌రే తీయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

బీఎంజే జర్నల్స్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. ఫ్రాన్స్‌లోని డాక్టర్లు 52 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 100 లోహపు వస్తువులను తొలగించారు. సైకోసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సదరు వ్యక్తి.. ఉద్దేశపూర్వకంగా లోహపు వస్తువులు తినే అలవాటు ఉందట. కత్తులు, స్క్రూలు, గింజలు, చెంచా హ్యాండిల్స్, స్క్రూడ్రైవర్ హెడ్, వాషర్, గులకరాళ్లు, నాణేలు, ఇనుప తీగలు లాంటివి తినేవాడట.
ఇది చదవండి: ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు
ఆ వ్యక్తి ఐదు సంవత్సరాల కాలంలో ఐదుసార్లు ఆస్పత్రికి వచ్చాడట. కడుపు నొప్పి, వికారం, రక్తపు వాంతులు లాంటి లక్షణాలతో చేరాడు. ఇక అస్పత్రికొచ్చిన అతడికి పలు పరీక్షలు, టెస్టులు చేయగా.. ఎండియోస్కోపిలో పలు లోహపు వస్తువులు అతడి కడుపులో ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ లోహ వస్తువులు అతని కడుపులో రంధ్రాలు చేసాయని.. అందువల్ల శస్త్రచికిత్స ద్వారా వాటిని బయటకు తీసహ్రు. ఆ వ్యక్తి మూడు నెలల కాలంలో ఈ లోహ వస్తువులను మింగాడని వైద్యులు భావిస్తున్నారు.
సైకోసిస్.. దాని ప్రభావాలు..
UK-ఆధారిత నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) ప్రకారం, భ్రాంతులు(ఎవరైనా తమ మనసుకు వెలుపల లేని వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు, వాసన చూసినప్పుడు, రుచి చూసినప్పుడు లేదా అనుభూతి చెందినప్పుడు), భ్రమలు (ఒక వ్యక్తికి అవాస్తవమైన దానిపై అచంచలమైన నమ్మకం ఉన్నప్పుడు), గందరగోళం, చెదిరిన ఆలోచనలు(సైకోసిస్ ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు చెదిరిన, గందరగోళం కలిగించే ఆలోచనా విధానాలను కలిగి ఉంటారు) వంటి లక్షణాలను సైకోసిస్ అంటారు. పైన పేర్కొన్న మెడికల్ కేసులోనూ ఈ లక్షణాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.

ఇది చదవండి: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..