అసలే ఎండాకాలం.. పూల మొక్కలు వాడిపోతున్నాయా? 

Samatha

14 march 2026

వేసవి కాలం వచ్చిందంటే చాలు పూల మొక్కల పై ఆకులు ఎండిపోవడం, మొక్క వాడిపోయినట్లు అవుతుంది.

వేసవి

అయితే ఈ సమ్మర్‌లో మీ పూల మొక్కలు ఎండిపోకుండా, ఎప్పుడూ పచ్చగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే.

పూల మొక్కలు

సమ్మర్ ప్రారంభం నుంచే మొక్కలపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వాటికి ఎండ ఎంత వరకు తాకుతుంది. అనే విషయాలను గమనించాలి.

మొక్కలపై శ్రద్ధ

తప్పకుండా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నీళ్లు పోయాలి. దీని వలన మట్టిలో తేమ ఉంటుంది. మొక్క బలంగా ఉంటుంది.

ఉదయం, సాయంత్రం

కొంత మంది ఎండ కొడుతుంది కదా అని మధ్యాహ్నం వేళల్లో నీళ్లు పోస్తుంటారు. కానీ ఇది మొక్కలు త్వరగా ఎండిపోయేలా చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

మొక్కలు వాడిపోవడం

అలాగే కుండీలో గనుక పూల మొక్కలు ఉన్నట్లు అయితే వీటిని మధ్యాహ్నం అధికంగా ఎండ ఉన్న సమయంలో కాస్త నీడలో పెట్టడం చేయాలి. దీని వలన మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

కుండీలో మొక్కలు

మొక్కలు తోటలో గనుక ఉంటే వాటిపై షేడ్ నెట్ లేదా ఏవైనా పలచటివి పందిరిలా ఏర్పాటు చేయాలి. అప్పుడు మొక్కలకు ఎక్కువగా ఎండ తగలకుండా ఉంటుంది.

తోట

అదే విధంగా ఎండిన ఆకులు, కొమ్మలు కత్తిరించాలి. ఎప్పటికప్పుడు ఎరువులు వేయాలి. అంతే కాకుండా, మల్చింగ్ చేయడం వలన మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి.

కత్తిరింపులు