AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన మీద నుంచి రైలు వెళ్తుంటే వీడియో తీసిన యువకుడు.. VC సజ్జనార్ సీరియస్‌ వార్నింగ్!

సోషల్ మీడియాలో ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్‌ కోసం యువత పడరాని పాట్లు పడుతున్నారు. పిచ్చి పిచ్చి రీల్స్‌ చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పటికే ఎందరో ఇలా రీల్స్ మోజులో నిండు జీవితాన్ని బలిచ్చారు. అయినా వీరిలో రీల్స్ యావ తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు రీల్స్ చేసేందుకు ఏకంగా రైలు పట్టాలపై పడుకుని..

Viral Video: తన మీద నుంచి రైలు వెళ్తుంటే వీడియో తీసిన యువకుడు.. VC సజ్జనార్ సీరియస్‌ వార్నింగ్!
Youth Lying On Railway Track For Social Media Reels
Srilakshmi C
|

Updated on: Jul 22, 2025 | 4:01 PM

Share

హైదరాబాద్‌, జులై 22: ఓవర్‌ నైట్‌ స్టార్‌ డమ్‌ కోసం యువత పడరాని పాట్లు పడుతున్నారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్‌ చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పటికే ఎందరో ఇలా రీల్స్ మోజులో నిండు జీవితాన్ని బలిచ్చారు. అయినా వీరిలో రీల్స్ యావ తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు రీల్స్ చేసేందుకు ఏకంగా రైలు పట్టాలపై పడుకున్నాడు. ఆనక రైలు తన మీద గుండా వెళ్తుంటే చేతిలో మొబైల్‌ పోన్ కెమెరా ఆన్‌ చేసి వీడియో చిత్రీస్తూ తన్మయత్వం పొందుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడయో కాస్తా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కంట పడింది. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి పిచ్చిపనులు చేసి, నిండు జీవితాన్ని చేజేతులా నాశనం చేసకోవద్దని తెలుపుతూ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. అసలేం జరిగిందంటే..

పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే!? సోషల్ మీడియాలో పేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉంది.. అని తన ట్వీట్‌లో హెచ్చరించారు. ఇందులో సదరు యువకుడు చేసిన వీడియోను కూడా సజ్జనార్‌ పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ఎప్పటికప్పుడు యువతకు తగు సూచనలు ఇస్తూ ఉంటారు. తాజాగా రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుంటే వీడియో చిత్రించున్న యువకుడి తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా మత్తులో పడి ఇలాంటి యువత వేస్తున్న వెర్రి వేషాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.