AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC EPFO Jobs 2025: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO)లో.. ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు మరో రెండు రోజుల్లోనే..

UPSC EPFO Jobs 2025: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
UPSC EPFO Jobs
Srilakshmi C
|

Updated on: Jul 27, 2025 | 2:39 PM

Share

కేంద్ర ఆర్ధిక శాఖ పరిధిలోని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO)లో.. ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 230 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 29, 2025 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 156, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టులు 74 వరకు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్స్‌ ఆఫీసర్ పోస్టులకు జనరల్‌ అభ్యర్ధులకు 35 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 35 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు 40 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు 45 ఏళ్లు ఉండాలి. అలాగే అసిస్టెంట్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టులకు జనరల్‌ అభ్యర్ధులకు 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధులకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు 40 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 29, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తులను ఆగస్టు 18, 2025వ తేదీ రాత్రి 11 గంటగల 59 నిమిషాల వరకు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్ష విధానం, సిలబస్‌ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి కమిషన్‌ షాట్ నోటీస్‌ మాత్రమే జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ షాట్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..