AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్‌ మూవీ.. రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్

ఒక్కోసారి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేని సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటుంటాయి. రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో టాప్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

OTT Movie: ఓటీటీలో ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్‌ మూవీ.. రిలీజ్ రోజు నుంచే ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 03, 2025 | 8:42 PM

Share

ఎప్పటిలాగే గత శుక్రవారం (ఆగస్టు 01) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. దాదాపు 35కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చాయి. నితిన్ తమ్ముడు, ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్, సిద్ధార్థ్ 3 బీహెచ్‌కే, సుహాస్ ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064 వంటి సినిమాలు కాస్త ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటితో పాటు స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆలరిస్తోంది. హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ రికార్డు వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఈ కథ సాగుతుంది. అనాథగా పెరిగిన సుశాంత్ నైట్‌ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతను పనిచేసే కెమికల్‌ కంపెనీ బిల్డింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని హత్య చేసే ప్రయత్నం చేస్తుంటారు. వారి నుంచి ఆ అమ్మాయిని సేవ్‌ చేస్తాడు సుశాంత్‌. దీని తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సుశాంత్. సపరేట్‌గా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే సుశాంత్ పని చేసే బిల్డింగ్‌ లో రాత్రి సమయంలో భయానక శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో ఆ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ తర్వాత సుశాంత్ కలలోకి దెయ్యాలు వస్తుంటాయి. దీంతో తన భార్యను తీసుకుని ఒక రోజు రాత్రి ఆ బిల్డింగ్ లోకి వెళతారు. అక్కడ తాళం వేసిన ఓ కొత్త రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ వారికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి.

ఈ క్రమంలో సుశాంత్ భార్య కింద పడిపోతుంది. ఆస్పత్రిలో చేర్పిస్తే ఆమెలో మరో ఆత్మ చేరిందని, ఇప్పుడు తన కంట్రోల్ లోనే ఆమె ఉందని చెబుతారు. మరి సుశాంత్ భార్యలోకి చేరిన ఆ ఆత్మ ఎవరిది? దాని కథేంటి? ఆ ఆత్మ నుంచి సుశాంత్ భార్య‌ ఎలా బయటపడింది? అందుకు సుశాంత్‌ ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు గార్డ్. విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, హర్రర్‌ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి గార్డ్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం