AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సింపుల్‌గా కనిపించినా.. తన బర్త్‌ డే పార్టీలో మృణాళ్ ధరించిన ఈ డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా?

తెలుగుతో పాటు హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది మృణాళ్ ఠాకూర్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలేతన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.

Mrunal Thakur: సింపుల్‌గా కనిపించినా.. తన బర్త్‌ డే పార్టీలో మృణాళ్ ధరించిన ఈ డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా?
Mrunal Thakur
Basha Shek
|

Updated on: Aug 04, 2025 | 1:49 PM

Share

సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయింది బాలీవుడ్ అందాల తార మృణాళ్ ఠాకూర్. ప్రస్తుతం అడివి శేష్ సరసన డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోందీ స్టార్ హీరోయిన్. అలాగే హిందీలోనూ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే శుక్రవారం (ఆగస్టు 01) 34వ వసంతంలోకి అడుగు పెట్టింది మృణాళ్. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన ఫ్రెండ్స్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చింది మృణాళ్. తమన్నా, మౌనీ రాయ్‌, నుష్రత్‌ బరూచా, రోష్ని వాలియా తదితర సినీ తారలు హాజరయ్యారు. మృణాళ్ బర్త్ డే పార్టీ కి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇదే క్రమంలో మృణాళ్ ధరించిన డ్రెస్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ డ్రెస్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, ధర చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

మృణాల్ పుట్టినరోజు సందర్భంగా లూయిస్ విట్టన్ ఫాల్-వింటర్ 2022 కలెక్షన్ నుంచి అద్భుతమైన పూల జాక్వర్డ్ మినీ డ్రెస్‌ ధరించింది. .ఇటలీలో తయారు చేసిన ఈ డ్రెస్ ధర సుమారు రూ. 2.83 లక్షలు అని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ ఒక్క డ్రస్సుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆరు నెలల పాటు ఎంతో విలాసవంతంగా గడిపేయవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మృణాళ్ బర్త్ డే పార్టీ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Roshni Walia (@roshniwaliaa)

సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సన్నాఫ్ సర్దార్ 2 అనే హిందీ సినిమాలో నటించింది మృణాళ్. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ అనే సినిమాలో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. షానీల్‌ డియో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

డెకాయిట్ సెట్ లో మృణాళ్ బర్త్ డే వేడుకలు..

డెకాయిట్ సెట్ లో మృణాళ్ బర్త్ డే వేడుకలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి