AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COOLIE: తెలుగులో అదరగొట్టిన తలైవా.. నాగార్జునతో వర్కింగ్ జీవితంలో మర్చిపోలేనన్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న కూలీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

COOLIE: తెలుగులో అదరగొట్టిన తలైవా.. నాగార్జునతో వర్కింగ్ జీవితంలో మర్చిపోలేనన్న సూపర్ స్టార్
Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2025 | 1:06 PM

Share

రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్య రాజ్, శ్రుతిహాసన్ ఇలా చాలా మంది నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ వీడియో ద్వారా మాట్లాడారు.

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

వీడియో ద్వారా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. తెలుగులో అదరగొట్టారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు. తెలుగులో రాజమౌళి ఎలానో తమిళ్ లో లోకేష్ కనగరాజ్ అలా.. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమా స్పెషల్ గెస్ట్ గా నటిస్తున్నారు. అన్నిన్నిటికంటే పెద్ద సర్ ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. కథ విన్నప్పుడు నేనే విలన్ గా చేయాలనీ అనుకున్నా.. అంత పవర్ ఫుల్ పాత్ర అది. అయితే కూలీ సినిమాలో విలన్ ఎవరు నటిస్తారా అని అనుకున్నా.. లోకేష్ వచ్చి నాగార్జున చేస్తున్నారు అని అన్నారు నేను షాక్ అయ్యాను.

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

నాగార్జున చేస్తున్నారు అని చెప్పడంతో నేను షాక్ అయ్యా.. 33 ఏళ్ల క్రితం నాగార్జునతో ఓ సినిమా చేశా.. అప్పుడు నాగ్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ చూసి ఆయనను అడిగాను .. ఇలా ఎలా ఉండగలరు అని.. ఆయన సింపుల్ గా వర్కౌట్స్ చేస్తాను. స్విమింగ్ చేస్తా.. అలాగే మా నాన్న గారి జీన్స్ అని చెప్పారు .. వీటితో పాటు నేను ఏదీ మనసులోకి తీసుకొను అని అన్నారు. అది ఆయన సీక్రెట్. నాగార్జున గారితో గడిపిన రోజులను నేను లైఫ్ లో మర్చిపోలేను, మీతో మాట్లాడింది, మీ సలహాలు నేను లైఫ్ లో మర్చిపోలేను అన్నారు రజినీకాంత్. విలన్ గా అదరగొట్టేశాడు నాగ్. నేను కూడా ఇలా చేయలేను అనిపించింది. బాషా సినిమాలో ఎలాగైతే ఓ ఆంటోని పాత్ర ఉంటుందో, నాగ్ పాత్ర కూడా అలానే ఉంటుంది.  అలాగే ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాగా ఆడాలి, మీరు ఆడించాలి అని అన్నారు సూపర్ స్టార్.

ఇవి కూడా చదవండి

అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..