AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Soldiers: ఏంటి? ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మేనకోడలా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

'వన్ ఫిల్మ్ వండర్' లా కొద్ది మంది ఒకటి లేదా రెండు సినిమాలతోనే సరిపెడతారు. కానీ తమ నటనతో ఎప్పటికీ గుర్తుండి పోతారు. ఈ లిటిల్ సోల్జర్స్ చిన్నారి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. మరి ఇప్పుడీ క్యూటీ ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుందాం రండి

Little Soldiers: ఏంటి? ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మేనకోడలా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
Little Soldiers
Basha Shek
|

Updated on: Aug 05, 2025 | 8:44 PM

Share

లిటిల్ సోల్జర్స్.. 1996లో విడుదలైన ఒక తెలుగు సినిమా. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా చిన్న పిల్లలతో ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కామెడీ, క్రైమ్, సస్పెన్స్‌ ఇలా అన్ని అంశాలున్న ఈ సినిమాలో ఉంటాయి. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో రమేశ్ అరవింద్, హీరా రాజ గోపాల్, గిరి బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుధాకర్, గిరిబాబు, బెనర్జీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అయితే వీరందరికన్నా ఇద్దరు పిల్లల చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. వారే బన్నీ, సన్నీ (సినిమాలో పిల్లల పేర్లు). ఇందులో బన్నీగా బాలాదిత్య నటిస్తే, సన్నీగా కావ్య అనే అమ్మాయి నటించింది. ఇద్దరూ తమ నటనతో అదరగొట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా కావ్య యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. చాలా మంది ఈ అమ్మాయి అల్లరి చూసేందుకు లిటిల్ సోల్జర్స్ సినిమాను రిపీట్ చేస్తుంటారు. అంతలా ఆడియెన్స్ మనసుల్లో నిలిచిపోయింది కావ్య.

ఒక్క సినిమాతోనే సరి..

అయితే లిటిల్ సోల్జర్స్ హిట్ అయిన తర్వాత కావ్య మరే సినిమాలోనూ కనిపించలేదు. అన్నట్లు ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. లిటిల్ సోల్జర్స్ సినిమా దర్శకుడు గుణ్ణం రంగరాజు సోదరి కూతురే కావ్య. ఇక తండ్రి ఎవరో తెలుసా? హైదరాబాద్ లో సన్ షైన్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ గురువారెడ్డి. తల్లి కూడా ఫేమస్ గైనకాలజిస్ట్. అమ్మానాన్నల బాటలోనే నడుస్తూ కావ్య కూడా డాక్టర్ అయిపోయింది. అన్నట్లు ఇదే లిటిల్ సోల్జర్స్ సినిమాలో కావ్య సోదరుడు ఆదర్శ్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఇప్పుడు అతను కూడా డాక్టర్ గా స్థిరపడిపోయాడు.

ఇవి కూడా చదవండి
Kavya

Kavya Family

ఆ ఇంట్లో అందరూ డాక్టర్లే..

2015 లో కుషాల్ అనే వ్యక్తిని కావ్య పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. కుషాల్ కూడా మణిపాల్ లో మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ గా సెటిలయ్యాడు. 2017 కేరళలో జరిగిన కావ్య వివాహానికి దర్శక ధీరుడు రాజమౌళితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Kavya Family

Kavya Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..