- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Did 17 Movies in Telugu, Did not Get Stardom, Her Name Is Catherine Tresa
Actress: 17 సినిమాలు చేసిన రానీ స్టార్ డమ్.. అయినా టాప్ హీరోలతోనే ఛాన్సులు.. ఎవరంటే..
అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్స్.. ఇప్పటికీ స్టార్ డమ్ కోసం వెయిట్ చేస్తుంటారు. వరుస అవకాశాలు అందుకున్నప్పటికీ క్రేజ్ సొంతం చేసుకొని ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. దాదాపు 17 సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ అందుకోలేకపోయింది.
Updated on: Aug 05, 2025 | 8:21 PM

అందంలో అప్సరస ఈ అమ్మడు. తెలుగులో దాదాపు 17 సినిమాలు చేసింది. అందులో చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. అయినప్పటికీ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.

ఆమె మరెవరో కాదండి.. కేథరిన్ థ్రెసా.. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. దుబాయ్ లో మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పుడే పియానో, నృత్యం, గానం, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్ నేర్చుకుంది. అదే సమయంలో ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ వాలంటీర్‌గా చేసింది.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2013లో చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటించారు. ఈ సినిమా సక్సెస్ కాలేదు. కానీ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన పైనా చిత్రంలో నటించింది.

అలాగే అల్లు అర్జున్ జోడిగా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించింది. రానాతో నేనే రాజు నేనే మంత్రి, గోపిచంద్ సరసన గౌతమ్ నంద వంటి చిత్రాల్లో నటించింది. కథానాయికగానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్మురేపింది. జయజనకీ నాయక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

స్టార్ హీరోల సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నప్పటికీ ఈ బ్యూటీకీ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇప్పటికీ తెలుగుతోపాటు తమిళం చిత్రాల్లో నటిస్తుంది. కానీ అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది ఈ బ్యూటీ.




