- Telugu News Photo Gallery Cinema photos Avatar 3 Box Office 20 Billion dollars Target, India Release Date and Expectations
Avatar 3: అవతార్ 3 టార్గెట్ అన్ని వేల కోట్లా..? సినిమా బిజినెస్ చూస్తుంటే మతి పోతుందిగా
మామూలుగా అయితే హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర పెద్దగా క్రేజ్ ఉండదు.. ఉన్నా మన సినిమాలను డామినేట్ చేసేంత స్థాయి ఉండదు.. కానీ అవతార్ మాత్రం ప్రత్యేకమే. ఆ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తుంటే మతి పోతుంది. పంచ భూతాలే పునాదిగా వస్తున్న అవతార్ 3 బిజినెస్ ప్రపంచ సినిమాను డామినేట్ చేస్తుంది. ఇంతకీ ఈ చిత్ర బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా..?
Updated on: Aug 05, 2025 | 5:23 PM

పేరుకు హాలీవుడ్ అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. మూడేళ్ళ కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని మళ్లీ నిరూపించింది అవతార్ 2. పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అని అర్థమవుతుంది. మొదటి భాగాన్ని నేల మీద.. రెండో భాగాన్ని నీళ్ళలో తీసారు జేమ్స్.

మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేస్తున్నారిందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం.

2009లోనే 13500 కోట్లు వసూలు చేసింది అవతార్.. అలాగే 2022లో 12500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 బిజినెస్ నెక్ట్స్ లెవల్‌లో జరుగుతుంది.

దీని టార్గెట్ 20 వేల కోట్లు. ఇప్పుడున్న డాలర్ వ్యాల్యూకు ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలోనూ 200 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతుంది బాక్సాఫీస్ దగ్గర.




