AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

సీరియల్స్ ద్వారా తెలుగు జనాలకు దగ్గరైన సెలబ్రెటీలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. నిత్యం టీవీల్లో కనిపిస్తూనే ప్రేక్షకులకు దగ్గరైన పాత్రలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నెట్టింట సీరియల్ తారలు చేసే గ్లామర్ రచ్చ గురించి తెలిసిందే.

Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
Jyothi Rai
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2025 | 8:45 PM

Share

బుల్లితెరపై సీరియల్స్ కు ఎంతగా క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. రోటీన్ స్టోరీ, సాగదీత ఎక్కువగా.. నాటకీయత ఎక్కువైనా సరే.. నిత్యం సీరియల్స్ చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు సీరియల్స్.. అందులోని తారలకు ఎంత అభిమానులుగా మారతారో తెలిసిందే. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి ఛానల్లో ఏదోక సీరియల్ ప్రసారమవుతూనే ఉంటుంది. సాధారణంగా ధారవాహికలలో నటించే హీరోహీరోయిన్ పాత్రకు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ ఇప్పుడు విలన్ పాత్రలు, సహాయ పాత్రలకు సైతం అభిమానులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా అమ్మ, అత్త, వదిన పాత్రలలో నటించే తారకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీకి సైతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే నమ్మగలరా.. ?

ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

ఇవి కూడా చదవండి

ఒకే ఒక్క సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందులో కొడుకు ప్రేమ కోసం ఆరాట పడే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. మంచి క్రేజ్ వచ్చిన సమయంలోనే అనుహ్యంగా ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. కానీ తన నటనకు.. చీరకట్టులో ఆమె హుందాతనంకు తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాందించుకుంది. ఇటీవలే ఆ సీరియల్ కు ఎండ్ కార్డ్ పడింది. ఇన్నాళ్లు చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. అందంలో హీరోయిన్లకు సైతం గట్టిపోటినిస్తుంది. ముఖ్యంగా గ్లామర్ డ్రెస్సులలో నెట్టింట సెగలు పుట్టిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. తెలుగు సీరియల్ అడియన్స్ ఫేవరేట్ నటి జగతి మేడమ్… అలియాస్ జ్యోతిరాయ్.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

బుల్లితెరపై ఫేమస్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో హీరో రిషి తల్లిగా.. కాలేజీ లెక్చరర్ జగతి మేడమ్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. సీరియల్లో తల్లిపాత్రలో నటించిన ఈ భామ.. ఇప్పుడు నెట్టింట మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..

ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?