AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: సూర్యకు చేతులెత్తి మొక్కాల్సిందే.. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారో తెలుసా?

హీరో సూర్య సినిమాలు ఈ మధ్యన పెద్దగా ఆడడం లేదు. కానీ అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. తగ్గబోదు. ముఖ్యంగా తెలుగులో ఈ స్టార్ హీరోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు అతని సినిమాలే కారణం కాదు గొప్ప మనసుతో చేపడుతోన్న సామాజిక సేవా కార్యక్రమాలు.

Suriya: సూర్యకు చేతులెత్తి మొక్కాల్సిందే.. అగరం ఫౌండేషన్ ద్వారా ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారో తెలుసా?
Suriya
Basha Shek
|

Updated on: Aug 05, 2025 | 10:10 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటుడికి భారీగా అభిమానులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి సూర్యకు సరైన హిట్ పడడం లేదు. అతను చేస్తోన్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అయితే తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరడం లేదు. ముఖ్యంగా తెలుగు నాట సూర్యకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందుకు కారణం అతని సినిమాలే కాదు.. సామాజిక సేవా దృక్పథంతో చేస్తోన్న అతను మంచి పనులు.వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేసేందుకు ఈ స్టార్ హీరో ముందుంటాడు. ఇక అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి సూర్య చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగ చదివిస్తున్నాడీ స్టార్ హీరో. పేదలు, అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు సూర్య. ఇందు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తమ ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది. తాజాగా ఈ అగరం ఫౌండేషన్ ప్రారంభమై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ, కమల్ హాసన్, డైరెక్టర్ వెట్రిమారన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటి దాకా 8 వేలమంది చదువు పూర్తి చేశారట. అందరూ డిగ్రీ పట్టాలు అందుకున్నారట.ఇందులో 1800 మంది ఇంజినీర్లు ఉంటే, డాక్టర్లయిన వారి సంఖ్య 51. వీళ్లందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదికి వచ్చారు. అగరం ఫౌండేషన్ తమ జీవితాలు ఎలా మలుపు తిప్పిందో చెప్పుకొచ్చారు . ఈ సందర్భంగా వీరిని చూసి హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సూర్య చేస్తున్న గొప్ప పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

8000మందికి పైగా..

ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రికార్డు స్థాయిలో 63 విభాగాల్లో బరిలోకి దిగుతున్న భారత్..!
రికార్డు స్థాయిలో 63 విభాగాల్లో బరిలోకి దిగుతున్న భారత్..!
శరీరానికి చలువ చేసి అమృతంలాంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం
శరీరానికి చలువ చేసి అమృతంలాంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం
ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులో తెలుగమ్మాయి..
ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులో తెలుగమ్మాయి..
భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా?
భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా?
Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. కో-లివింగ్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్
Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. కో-లివింగ్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్
20 ఏళ్ల పెట్టుబడి ప్రణాళిక.. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి..?
20 ఏళ్ల పెట్టుబడి ప్రణాళిక.. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి..?
SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలో తెలుసా
SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలో తెలుసా
198 కి.మీ. స్పీడ్.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే చావు!
198 కి.మీ. స్పీడ్.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే చావు!
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. పెద్దలకు మాత్రమే
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. పెద్దలకు మాత్రమే
ఇదేందయ్యా ఇదీ.. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. వీడియో చూస్తే..
ఇదేందయ్యా ఇదీ.. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. వీడియో చూస్తే..