AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhu Priya: మా చెల్లి పెళ్లి కూతురాయనే! హల్దీ వేడుకల్లో సింగర్ మధుప్రియ డ్యాన్స్ చూశారా? వీడియో ఇదిగో

ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ సోదరి శ్రుతి ప్రియ పెళ్లిపీటలెక్కనుంది. సుమంత్ పటేల్ అనే వ్యక్తితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. సింగర్ మధు ప్రియనే దగ్గరుండి మరీ తన చెల్లి నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకుంది.

Madhu Priya: మా చెల్లి పెళ్లి కూతురాయనే! హల్దీ వేడుకల్లో సింగర్ మధుప్రియ డ్యాన్స్ చూశారా? వీడియో ఇదిగో
Madhu Priya
Basha Shek
|

Updated on: Aug 05, 2025 | 10:40 PM

Share

ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే దగ్గరుండి తన చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం ఆమె పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయింది. తనే దగ్గరుండి అన్ని పెళ్లి పనులు చూసుకుంటోంది. అలాగే ఎప్పటికప్పుడు తన చెల్లి పెళ్లి అప్డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. శ్రుతి ప్రియ పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంటోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం (ఆగస్టు 05) హల్దీ వేడుక అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన చెల్లితో కలిసి తీన్మార్ డ్యాన్స్ లు వేసింది మధు ప్రియ. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.  మా చెల్లి పెళ్లి కూతురైందంటూ ఆనందం వ్యక్తం చేసింది.  మధు ప్రియ చెల్లెలు ప్రీ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మధు ప్రియ సోదరికి  ముందస్తు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. ఓ స్టేజీ షోలో ‘ఆడపిల్లనమ్మా’ పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది.  అప్పటికింకా ఆమెకు ఇంకా పదేళ్లు మాత్రమే. ఆ తర్వాత 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో ‘పెద్దపులి’ అనే పాటతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది.ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించింది కూడా మధు ప్రియనే. మేల్ వెర్షన్ లో రమణ గోగుల ఈ సాంగ్ ను ఆలపించగా, లేడీ వెర్షన్ లో మధు ప్రియ అద్భుతంగా పాడింది. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చెల్లి హల్దీ వేడుకల్లో సింగర్ మధు ప్రియ డ్యాన్స్..

 సినిమాలు, పాటల సంగతి పక్కన పెడితే.. 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మధుప్రియ. అయితే కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి