Actress Sirisha: స్టార్ హీరోలకు సిస్టర్‌గా నటించిన ఈ అమ్మడు గుర్తుందా? ఇప్పుడేలా మారిపోయిందో చూశారా? వీడియో
సాధారణంగా మనం స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. కానీ కొన్ని సినిమాల్లోని సిస్టర్స్ క్యారెక్టర్స్ కూడా మనకు బాగా గుర్తుండిపోతుంటాయి. ఈ అందాల తార కూడా సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది. మరి ఇప్పుడామే ఏం చేస్తుందో తెలుసుకుందాం రండి.

మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి చెల్లెలి క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచారు నటి శిరీష చతుర్వేదుల. మొదట మనసంతా నువ్వే’ సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లెలిగా టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె తెలుగులో దాదాపు అందరు హీరోలకు సిస్టర్ యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1, రవితేజ వెంకీ, జగపతి బాబు అతడే ఒక సైన్యం, ఎన్టీఆర్ సుబ్బు, పవన్ కల్యాణ్ బాలు, తరుణ్ చిరుజల్లు, రవితేజ బలాదూర్, ఆంధ్రావాలా, సత్యం, వెంకీ.. ఇలా తెలుగుతో దాదాపు 30 సినిమాల్లో యాక్ట్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ, ఎన్టీఆర్, జగపతి బాబు తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమాలతోపాటు యాంకరింగ్, సీరియల్స్ కూడా చేశారీ అందాల తార. శిరీష నటించిన నాగాస్త్రం అప్పట్లో చాలా పెద్ద హిట్. దీంతో పాటు అలౌఖిక, పద్మవ్యూహం, ఎండమావులు, నాతిచరామి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి మెప్పించారు శిరీష.
కాగా శిరీష భర్త డెల్ టెక్నాలజీస్ లో పని చేస్తున్నారు. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు, టీవీషోలకు దూరమైపోయారు శిరీష. అదే క్రమంలో టీచర్ గా కూడా పనిచేశారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు బోధించారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయిన శిరీష అక్కడ కేంద్రీయ విద్యాలయంలోనూ హైస్కూల్ ఇంగ్లిష్, మ్యాథ్స్ టీచర్‌గా పని చేశారు.
నటి శిరీష లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
అయితే ఇదే సమయంలో శిరీషకు మళ్లీ సీరియల్స్ అవకాశాలు వచ్చాయి. అలా చాలా గ్యాప్ తర్వాత మౌనరాగం సీరియల్ లో కనిపించారీ అలాగే ‘సీతే రాముడి కట్నం’ ధారావాహికలోనూ యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటి కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్లు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు శిరీష. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాగే లైఫ్ స్టైల్ కు సంబంధించిన విషయాలపై కూడా ఆసక్తికరమైన వీడియోలు పంచుకుంటున్నారీ అందాల తార. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
View this post on Instagram
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యతో శిరీష..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








