OTT Movie: హింట్ ఇచ్చి మరీ 9 హత్యలు.. పోలీసులను పరుగులు పెట్టించే సైకో కిల్లర్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఇప్పుడు మలయాళం సినిమాలను అందరూ ఇష్టంగా చూస్తున్నారు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలనూ అసలు వదిలి పెట్టడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లరే. ఇందులో సూపర్ స్టార్ మమ్ముట్టి నటించడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే పంథాలో సాగుతాయి. అయితే ఈ మధ్యన మలయాళ దర్శకులు వీటిని మరింత ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్నారు. ఫలితంగా ఈ సినిమాలు థియేటర్లలోనూ, ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఎర్నాకులంలో వరుసగా తొమ్మిది హత్యలు జరుగుతాయి. వీటి వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని విచారణలో తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడానికి సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్ (మమ్మూట్టి) రంగంలోకి దిగుతాడు. ఈ హత్యలు చేసేటప్పుడు కిల్లర్ కొన్ని హింట్స్ వదులుతుంటాడు. అతను క్రిస్టియన్ ఎక్స్‌ట్రీమిస్ట్ అని, కేవలం నాస్తికులను మాత్రమే చంపుతున్నాడని తెలుసుకుంటాడు. దర్యాప్తులో భాగంగా మమ్ముట్టి స్థానిక సెమినరీలోని బ్రదర్ సైమన్‌ను అరెస్ట్ చేస్తాడు. అతను 10 మందిని చంపాలని ప్లాన్ చేసినట్లు చెబుతాడు. కానీ ఈ కేసు ఒక ప్రీస్ట్ హత్య దారి తీస్తుంది. దీంతో డ్యూటీలో నిర్లక్ష్యం కారణంగా మమ్ముట్టి సస్పెండ్ అవుతాడు.
అదే సమయంలో మమ్ముట్టి తమ్ముడు ఫిలిప్ అబ్రహాం తన ప్రేయసి అలీనా హత్య కేసులో నిందితుడిగా అరెస్టవుతాడు. తమ్ముడిపై ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ డ్యూటీకే ప్రాధాన్యమిస్తాడు మమ్ముట్టి. అయితే ఈ కుట్ర వెనక తనపై పగ పెంచుకున్న దినేష్, జాకబ్ అనే పోలీస్ అధికారులు ఉన్నట్లు మమ్ముట్టి తెలుసుకుంటాడు. ఇందుకు లాయర్ డయానా కూడా విలన్లకు సహాయం చేస్తుంది. చివరకు వీరంతా కలిసి అన్నయ్య చేతుల మీదుగానే ఫిలిప్‌కు జైలు శిక్ష పడేలా చేస్తారు. దాంతో అన్నపై పగను పెంచుకున్న ఫిలిప్ జైలు నుంచి తప్పించుకుంటాడు. మమ్ముట్టిని చంపేందుకు ప్రయత్నిస్తాడు? మరి చివరకు ఏమైంది? ఫిలిప్‌ను ప్రాణంగా ప్రేమించిన అలీనా ఎలా చనిపోయింది? ఆమెను చంపింది ఎవరు? హీరోపై దినేష్, జాకబ్, డయానా ఎందుకు పగను పెంచుకున్నారు? తన తమ్ముడికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అంతకు ముందు సైమన్‌ను లాకప్‌లో ఎవరు చంపారు అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘అబ్రహామింటే సంతతికల్’. తెలుగులో డెరిక్ అబ్రహంగా విడుదలైది. షాజీ పడూర్ తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు , ఆన్సన్ పాల్ (ఫిలిప్ అబ్రహాం), కనిహ, సిద్దీఖ్, రెంజి పణిక్కర్, యోగ్ జపీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లోనూ అందుబాటులో ఉంది. Sun NXTతో పాటు MX Playerలో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందబాటులో ఉంది. ఈ మూవీకి IMDbలో 6.7/10 రేటింగ్ ఉండడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








