Telugu Indian Idol: మా తమ్ముడిలా చూసుకుంటాము.. మాటలు సరిగా రాని కంటెస్టెంట్కు తమన్ భరోసా..
మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వచ్చేసింది. ఆగస్ట్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ప్రతిభ ఉన్న ఎంతో మంది గాయనిగాయకులకు వేదికగా మారిన తెలుగు ఇండియన్ ఐడల్ నుంచి విడుదలైన తాజా ప్రోమో ఆకట్టుకుంటుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 4 స్టార్ట్ అయ్యింది. మంచి గుర్తింపు ఉండి సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది గాయనిగాయకులకు తెలుగు ఇండియన్ ఐడల్ సరైన వేదిక. ఇప్పటికే ఎంతోమంది ప్రతిభావంతులు ఈ షో ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు మరికొంతమంది మట్టిలోని మాణిక్యాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. సంతోషం, అద్భుతమైన ప్రతిభ, భావోద్వేగాలతో ఈ ఎపిసోడ్ సాగినట్లు తెలుస్తోంది. గల్లీ టూ గ్లోబల్ ట్యాగ్ లైన్ కు తగినట్లుగా పల్లెటూరి నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన సింగర్స్ పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో మాటాలు సరిగా రాని అనీష్ అనే కంటెస్టెంట్ ను తన తల్లి వేదిక పైకి తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
తన కొడుకు స్పీచ్ డిఫీకల్టీస్ అని చెప్పుకొచ్చింది. దీంతో తమన్ మాట్లాడుతూ..అనీష్ ను తమ తమ్ముడిలా చూసుకుంటామని అన్నారు. అనంతరం కంటెస్టెంట్ అనీష్ తో కలిసి సింగర్ కార్తీక్ ఎదుట నిలిచింది చూడు సాంగ్ ఆలపించారు. ప్రస్తుతం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..








