Coolie OTT: ఓటీటీలోకి రజనీకాంత్ కూలీ.. 500 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా రజనీ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తోన్న కూలీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్, రచితా రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పూజా హెగ్డే కూడా మోనికా పాటతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రజనీ మార్క్ యాక్షన్, నాగార్జున విలనిజం, షౌబిన్ షాహిర్, రచితా రామ్ ల పెర్ఫామెన్స్ సినిమా విజయంలో హైలెట్ గా నిలిచాయి. అలాగే అనిరుధ్ స్వరాలు, బీజీఎమ్ కూడా కూలీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన కూలీ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు దాటేసింది. చాలా చోట్ల ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది. అయితే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో థియేటర్స్ లో రిలీజ్ అయిన 28 రోజులకు కూలీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. అంటే సెప్టెంబర్ 11 నుంచి రజనీ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పలు పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి కూలీ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన కూలీ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు ఛాన్స్..
The D.I.S.C.O got a DATE✅ #Coolie (2025) Streaming From SEPTEMBER 11th On Prime Video in Tamil, Telugu, Kannada & Malayalam Audios💥🪙🔥
Hindi Version will be Mostly Out On SAME Day Or OCTOBER 9th❤️🔥#CoolieOnPrime#LokeshKanagaraj pic.twitter.com/UDR5arWUoB
— OTT STREAM UPDATES (@newottupdates) August 30, 2025
#Simon gonna Dominate #Deva in Edits For #Coolie Post OTT RELEASE🔥✅#CoolieOnPrime — SEPTEMBER 11th Premiere 🪙🤘💥 pic.twitter.com/IfWhW9mzJ8
— OTT STREAM UPDATES (@newottupdates) August 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








