Naga Shourya: పెళ్లయ్యాక వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య.. హీరో తల్లి ఏమన్నారంటే?
రంగబలి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు టాలీవుడ్ క్రేజీ హీరో నాగ శౌర్య. అయితే ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు మూడేళ్ల క్రితం అనుషా శెట్టి అనే అమ్మాయితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు నాగ శౌర్య. అయితే పెళ్లయ్యాక..

2023లో రంగబలి సినిమాలో చివరిగా వెండితెరపై కనిపించాడు హీరో నాగ శౌర్య. ఆ తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2022 నవంబర్ లో బెంగళూరుకు చెందిన అనుషా శెట్టితో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు నాగ శౌర్య. గతేడాదే ఈ దంపతులకు ఒక పాప పుట్టింది. అయితే పెళ్లయ్యాక తన భార్యతో కలిసి వేరే కాపురం పెట్టాడట నాగ శౌర్య. ఈ విషయాన్ని హీరో తల్లి ఉషా ముల్పురి ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం ఆమె కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాగశౌర్య చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం. అందుకే పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్‌లోనే మనవరాలి మొదటి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాం. తరచూ తనను వీడియో కాల్‌లో చూస్తుంటాను. కానీ తనను చాలా మిస్ అవుతున్నాను.
‘చిన్నప్పుడు శౌర్యతో పాటు నా మరో కుమారుడికి ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. నేను నా పిల్లలను ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపిస్తోంది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు’ అంటూ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు ఉషా.
తల్లితో హీరో నాగ శౌర్య..
View this post on Instagram
నాగశౌర్య తల్లి ఉష ప్రొడక్షన్ కంపెనీతోపాటు రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు నగరంలో పలు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు నాగ శౌర్య. పోలీస్ వారి హెచ్చరిక, బ్యాయ్ బాయ్ కార్తీక్ తో పాటు నారీ నారీ నడుమ మురారీ అనే సినిమాలతో బిజీగా ఉంటున్నాడు నాగ శౌర్య. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
భార్యతో నాగ శౌర్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








