AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

మాధురీ దీక్షిత్ మాదిరిగా స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను దొచుకుంది. అంతేకాదు.. బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ మటోండ్కర్ గట్టిపోటీనిచ్చింది. కానీ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Antara Mali
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2025 | 12:25 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ముద్దుగుమ్మ. మాధురీ దీక్షిత్ లా స్టార్ హీరోయిన్ కావాలని .. ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ అంతగా సక్సెస్ మాత్రం కాలేకపోయింది. కానీ ఒకప్పుడు అందం, అభినయంతో మాయ చేసింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె పేరు అంటారా మాలి. ప్రముఖ పోటోగ్రాఫర్ జగదీష్ మాలి కుమార్తె. 1998లో ధుందతే రహా జావోగే సినిమాతో బాలీవుడ్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1999లో సుమంత్ సరసన ప్రేమకథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యింది. తన కెరీర్‌లో వివేక్ ఒబెరాయ్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి అనేక మంది స్టార్లతో కలిసి పనిచేసింది. కానీ ఆమె మాత్రం స్టార్ డమ్ అందుకోలేదు. ‘ఖిలాడి 429’, ‘రోడ్’, ‘దర్ణ మన హై’, ‘కంపెనీ’, ‘మై మాధురి దీక్షిత్ బన్నా చాహతీ హూన్’ వంటి చిత్రాల్లో నటించింది. చివరిసారిగా 2010లో వచ్చిన అండ్ వన్స్ ఎగైన్ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో సన్యాసి పాత్రలో కనిపించింది. అందుకు ఆమె గుండు చేయించుకుంది. ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న ఫోటో ఆ సినిమాలోనిదే.

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

2009లో అంటారా జీక్యూ ఇండియా ఎడిటర్ చే కుర్రియన్ ను వివాహం చేసుకుంది. వీరికి పాప జన్మించింది. పెళ్లి తర్వాత సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది. 2013లో అంటారా వార్తలలో నిలిచింది.ఆమె తండ్రి జగదీష్ మాలి మింక్ బ్రార్, వెర్సోవా వీధుల్లో అర్దనగ్న స్థితిలో కనిపించారు. దీంతో తండ్రిని వదిలేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన తండ్రి మానసిక స్థితి బాగలేకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాని.. కానీ వదిలేశానంటూ విమర్శలు రావడం కరెక్ట్ కాదని తెలిపింది. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకు ఆమె తండ్రి మే 13, 2013న మరణించారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

Antara Mali Neews

Antara Mali Neews

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..