AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎమోషనల్ వీడియో వైరల్

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అలాగే సహాయక పాత్రలకు కూడా సై అంటున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటోన్న ఈ హీరో ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియాలో ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశాడు.

Tollywood: తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎమోషనల్ వీడియో వైరల్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Sep 04, 2025 | 7:25 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. సూచనలు ఇచ్చే గాడ్ ఫాదర్ కూడా లేడు. అయినా స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశాడు. క్రమంగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ లాంటి సంచలన డైరెక్టర్ల సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ హీరో ప్రస్తుతం బిజి బిజీగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడీ హ్యాండ్సమ్ హీరో ఒక శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ కొండా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అదిత్‌ అరుణ్‌ అలియాస్ త్రిగుణ్‌.

చెన్నైకు చెందిన త్రిగుణ్‌ 2023 సెప్టెంబర్‌లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి వివాహ వేడుకకు పలువరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారీ దంపతులు. దీని కంటే ముందు నివేదిత సీమంతం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను త్రిగుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి

భార్య సీమంతం వేడుకల్లో హీరో త్రిగుణ్..

కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు త్రిగుణ్. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, కడేవర్, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు తెలుగు, తమిళ సినిమాలున్నాయి.

భార్య నివేదితతో త్రిగుణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం