AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఏంటీ.. వీళ్లు అల్లు అర్జున్ సినిమాలో నటించారా? ఈ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ను గుర్తు పట్టారా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లుగా వెలుగొందుతోన్న చాలా మంది గతంలో ఏదో ఒక సినిమాలో నటించిన వారే. అలా ఓ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, క్రేజీ డైరెక్టర్ కూడా ఓ మూవీలో మెరిశారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మూవీలో... కానీ..

Allu Arjun: ఏంటీ..  వీళ్లు అల్లు అర్జున్ సినిమాలో నటించారా? ఈ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ను గుర్తు పట్టారా?
Arya Movie Scene
Basha Shek
|

Updated on: Sep 04, 2025 | 6:47 PM

Share

‘#90s: ఏ మిడిల్‌క్లాస్‌ వెబ్ సిరీస్ మౌళి హీరోగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివానీ నాగారం ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈటీవీ విన్ ఒరిజినల్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ నిర్మాతగా, సాయి మార్తాండ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 05న థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. శ్రీ విష్ణుతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఇదే ఈవెంట్ లో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఓ సినిమాలో నటించిన వీడియో బయటకు వచ్చింది. ఇదే ఈవెంట్ కు వచ్చిన ఆ నిర్మాత తన వీడియో చూసుకొని ఫుల్ గా నవ్వుకున్నాడు. ఇదెక్కడి దొరికిందిరా మీకు.. అంటూ ఆ సీన్ వెనక ఏం జరిగింది? అసలు తాను ఎందుకు యాక్ట్ చేసాడో చెప్పుకొచ్చాడు.

పై ఫొటోలో ఒక స్టార్ ప్రొడ్యూసరే కాదు దర్శకుడు కూడా ఉన్నారు. మరి వారెవరో మీరు గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ మేమే చెబుతాం లెండి. ఈ ఫొటోలో ఉన్దిన స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు. అలాగే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇదే ఫొటోలో వీరి పక్కన ఉన్న మరో వ్యక్తి దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్. ఈ సీన్ అల్లు అర్జున్ ఆర్య సినిమాలోది. బన్నీ వాసు నిర్మించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈవెంట్లో ఈ వీడియోని బయటపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా తానెందుకు ఆర్య సినిమాలో నటించాల్సి వచ్చిందో బన్నీవాసు బయట పెట్టాడు. ‘ఆరోజు ఆర్య సినిమా చివరి రోజు షూటింగ్‌. అయితే ముగ్గురు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు రాలేదు. దీంతో దిల్‌ రాజు ఆఫీస్‌ క్యాషియర్‌ శ్రీధర్‌, వకీల్‌ సాబ్‌ దర్శకుడు శ్రీరామ్‌ వేణు, నేను.. ముగ్గురం ఈ సీన్ లో నటించాం. ఇది డైరెక్టర్ సుకుమార్‌గారి ఆలోచనే.. మీరు ముగ్గురూ వేస్ట్‌గా పడున్నారు కదా.. ముందుకు రండి అని మాపై ఈ సన్నివేశం చిత్రీకరించారు. ఈ సీన్‌ చూశాక మా ఆవిడ నన్ను బాగా తిట్టింది. అప్పటినుంచి నేను ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఈ మధ్య మిత్రమండలి సినిమా కోసం నాతో ఏదో రీల్‌ చేయించారు. అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్‌ అవుతానని అనిపించి ఆ రీల్‌ బయటకు వదల్లేదు’ అని ఫన్నీగా చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.

ఆర్య సినిమాలో బన్నీ వాస్, వేణు శ్రీరామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ