Pawan Kalyan: నాగ్ రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా! కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.. ఏ మూవీనో తెలుసా?
నాగార్జున.. పవన్ కల్యాణ్.. ఇద్దరూ స్టార్ హీరోలే.. ఇద్దరికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నాగార్జున హీరోతో పాటు విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

సినిమా కథల ఎంపికలో ఎన్నో అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్టోరీ సెలక్షన్స్ పై ఒక్కో హీరోకు ఒక్కో అంచనా ఉంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా కామన్. ఒక హీరో చేయాల్సి న కథతో మరో హీరో సినిమాలు చేయడం ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటుంది. అలా అక్కినేని అందగాడు నాగార్జున చేయాల్సిన సినిమా ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లింది. కట్ చేస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి రికార్డుల మోత మోగించింది. ఇందులో పవన్ కల్యాణ్ యాక్టింగ్ అయితే అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలా మంది ఎగబడి చూస్తారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ మొదట నాగార్జునను హీరోగా అనుకున్నాడట. కథ కూడా చెప్పాడట. అయితే నాగ్ అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో డైరెక్టర్ చెప్పిన కథపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఈ సినిమా కథ నేరుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లిందట. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ యూత్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఇదే సినిమా డైరెక్టర్ ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో రెండు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు.
ఇలా నాగార్జున వద్దన్న కథతో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ మరేదో కాదు బద్రి. ఇది డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు మొదటి సినిమా. ఇందులో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లు గా యాక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాని అక్కినేని నాగార్జునతో చేయాలని ప్రయత్నించాడు పూరి. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పూరీకి, నాగార్జునతో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో బద్రీ సినిమా కథను మొదట మన్మథుడికే చెప్పాడట. అయితే నాగ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇదే సినిమాను పవన్ తో తీసి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు పూరీ. అయితే ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో సూపర్, శివమణి అనే రెండు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు పూరీ జగన్నాథ్.
బద్రి సినిమాకు క్లాప్ కొడుతోన్న మెగాస్టార్ చిరంజీవి..
‘ #Badri 2000 ‘ movie Clapping 📹📷🎥🎞️#BadriMovie #Chiranjeevi #DeputyCM #PawanKalyan #KalyanBabu #RamCharan𓃵 pic.twitter.com/kTqkWytmIX
— Ojaas Gambheera (@sanjay__sahu__) September 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








