Lokesh Kanagaraj: సక్సెస్ అంటే అదే అంటున్న లోకేష్ కనగరాజ్
ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో నంబర్ వన్ స్పాట్‌లో ఉన్నది ఎవరు అంటే లోకేష్ కనగరాజ్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో కనిపిస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి సినిమాలతో ఆయన మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. ఇటీవల ఒక ఈవెంట్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యంగ్ డైరెక్టర్లకు మాస్టర్ క్లాస్‌లా మారాయి. లోకేష్ ఏం చెప్పారంటే – 'బాక్సాఫీస్ దగ్గర కోట్లు రావడం ఒక్కటే సక్సెస్ కాదు.
Updated on: Sep 03, 2025 | 7:56 PM

ఇటీవల ఒక ఈవెంట్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యంగ్ డైరెక్టర్లకు మాస్టర్ క్లాస్‌లా మారాయి. లోకేష్ ఏం చెప్పారంటే – 'బాక్సాఫీస్ దగ్గర కోట్లు రావడం ఒక్కటే సక్సెస్ కాదు. మనం అనుకున్న కథని మన మనసులో అనుకున్న విధంగానే ప్రేక్షకుల కళ్లముందు పెట్టగలిగితే – అదే నిజమైన విజయం' అన్నారు.

అవును! ఈ జెనరేషన్ డైరెక్టర్స్ ఎక్కువగా బిజినెస్ నంబర్స్ మీద ఫోకస్ పెడుతుంటే, లోకేష్ మాత్రం కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఆయనకు ఆడియన్స్‌తో పాటు ఫిలిం మేకర్స్‌లోనూ ఫాలోయింగ్ పెరిగింది.

ప్రస్తుతం ఆయన తన Lokesh Cinematic Universe (LCU)ను మరింతగా ఎక్స్‌పాండ్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు. భవిష్యత్తులో పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ లెవెల్‌కు ‘LCU’ని బ్రాండ్‌ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు.

లోకేష్ కామెంట్స్ విషయంలో అభిమానుల రియాక్షన్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది – “లోకీ చెప్పింది రైట్. కంటెంట్ హిట్ అయితే డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ సంతృప్తే కావాలి” అని సపోర్ట్ చేస్తున్నారు.

మొత్తానికి ఆయన చెప్పిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని ఆలోచనలో పడేశాయి. కంటెంట్ వర్సెస్ కలెక్షన్స్ – ఎవరు విన్నా లోకేష్ మాటలకే ఓటు వేస్తున్నారు. అందుకే ఆయనను కంటెంట్ స్టార్ అని పిలుస్తున్నారు.




