- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Celebrity, She Is Only One Lady Music Director In Tollywood, Her Name Is Singer Sreelekha
Tollywood : పెద్దన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. చిన్నన్న తోపు టాలీవుడ్ డైరెక్టర్.. ఈమె ఇంటినిండా సినిమావాళ్లే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లేడీ సింగర్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు తెగ వైరలవుతుంది. సెలబ్రెటీ ఫ్యామిలీకి చెందిన ఆమె ఇప్పటివరకు అటు గాయనిగా, ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా తనదైన సత్తా చాటారు. ఎన్నో అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. అంతేకాదు..తెలుగులో ఆమె ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Sep 03, 2025 | 9:49 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఫేమస్ సింగర్. అంతేకాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్టర్. దాదాపు 80కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన తొలి మహిళా సంగీత దర్శకురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆమె ఎవరో కాదండి.. సింగర్ ఎంఎం శ్రీలేఖ. తెలుగులో ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్. ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆలపించారు. శ్రీలేఖ అలియాస్ కోడూరి శ్రీలేఖ. సంగీత దర్శకురాలిగా అనేక చిత్రాలను సంగీతం అందించింది.

అన్ని భాషల్లోనూ కలిపి దాదాపు 80కి పైగా సినిమాలకు సంగీతం అందించిన తొలి మహిళా సంగీత దర్శకురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు. తాజ్ మహల్, ధర్మచక్రం, నవ్వులాట, శివయ్య, మూడు ముక్కలాట, అమ్మాయి బాగుంది, అదిరిందయ్యా చంద్రం ఇలా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాటలు ఆలపించారు.

శ్రీలేఖ సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళికి చెల్లెలు అవుతుంది శ్రీలేఖ. అలాగే ఎంఎం కీరవాణికి సైతం చెల్లెలు. తొమ్మిదేళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఆమె 12 సంవత్సరాల వయసులో నలయ్య తీర్పు (1992) చిత్రంతో సంగీత దర్శకురాలిగా మారింది. తెలుగులో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన ఆమె.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే హిట్ 2 సినిమాతో సంగీత దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది.




