Mirai Movie: ‘మిరాయ్’ లో శ్రీరాముడి రోల్ చేసింది ఆ స్టార్ హీరో కాదు.. అసలు విషయం చెప్పేసిన తేజ సజ్జా
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు తేజ సజ్జా. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అతను ఇప్పుడు మరో మిరాయ్ అంటూ మరో పాన్ ఇండియా ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

హనుమాన్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. రితికా నాయక్ కథానాయిక. సీనియర్ హీరోయిన్ శ్రియ, జగపతి బాబు, జయ రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. తేజ సజ్జాకు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు తేజ సజ్జా. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నాడు.
కాగా మిరాయ సినిమా ట్రైలర్ ఎండింగ్ లో శ్రీరాముడి పాత్రను చూపించారు. దీంతో ఆ రోల్ చేసింది ఎవరనే దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. రాముడి పాత్రలో ఉన్నది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మిరాయ్ ప్రమోషన్లలో ఉన్న తేజ సజ్జాకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని కొందరు అడిగారు. దానికి తేజ సజ్జా కాదని సమాధానమిచ్చాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడింది. మరి మిరాయ్ లో రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 12 వరకు ఆగాల్సిందే.
మిరాయ్ ప్రమోషన్లలో తేజ సజ్జా..
#SuperYodha stealing hearts in Chennai ❤️🔥
Superhero @tejasajja123 had a heartfelt conversation at the Tamil Press Meet Event🎙️❤️#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER🥷
Tamil Nadu Release by @agscinemas ✨
Rocking Star @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/5J3jBhna2s
— People Media Factory (@peoplemediafcy) September 1, 2025
మిరాయ్ సినిమా ట్రైలర్..
Love, war and everything in between ❤🔥
Here’s the“𝐓𝐇𝐄 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 𝐌𝐎𝐖𝐆𝐋𝐈”
A @SandeepRaaaj directorial. 🌟ing @RoshanKanakala & #SakshiMhadolkar A @Kaalabhairava7 musical 🎵 #Mowgli#Mowgli2025@vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/SgJSsZBxd8
— People Media Factory (@peoplemediafcy) September 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








