AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: తల్లీ కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో! గణేష్ ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్.. ఆరాధ్యతో కలిసి పూజలు.. వీడియో

దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే బాగా పేరొందిన ముంబైలో అయితే అట్టహాసంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేశుడి వేడుకల్లో భాగమవుతున్నారు. తాజాగా ఐశ్వర్యారాయ్ తన కూతురుతో కలిసి గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంది.

Aishwarya Rai: తల్లీ కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో! గణేష్ ఉత్సవాల్లో ఐశ్వర్యారాయ్.. ఆరాధ్యతో కలిసి పూజలు.. వీడియో
Aishwarya Rai
Basha Shek
|

Updated on: Sep 01, 2025 | 7:47 PM

Share

ముంబైలో గణేశ్ నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొందరు తమ ఇళ్లల్లోనే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటే మరికొందరు సమీపంలోని వినాయక మండపాలకు వెళ్లి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. అలా తాజాగా ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబైలోని జీఎస్ బీ సేవా మండల్ గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైట్ డ్రెస్ లో ఐశ్వర్య ఎంతో అందంగా కనిపించింది. అలాగే ఆరాధ్య కూడా కుర్తాలో చాలా క్యూట్ గా ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ముంబైలో జీఎస్ బీ సేవాదళ్ నిర్వహించే గణపతి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సెలబ్రిటీలు కూడా ఇక్కడకు వచ్చి గణేశుడి ఆశీస్సులు పొందుతుంటారు. ఇక ఐశ్వర్య కూడా ఏటా జీఎస్ బీ గణేశ్ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య చివరిగా పొన్నియిన్ సెల్వన్ IIలో కనిపించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామాలో ఐశ్వర్య రెండు పాత్రల్లోనూ అదరగొట్టింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో ఐష్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయని అభిమానులు ఊహించారు.  అయితే దీని తర్వాత ఐష్ నుంచి ఎలాంటి కొత్త సినిమాలు రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఈ అందాల తారను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గణేశ్ ఉత్సవాల్లో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య.. వీడియో ఇదిగో

కాగా గత కొన్ని రోజులుగా అభిషేక్, ఐశ్వర్యల విడాకుల గురించి పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ వీరు మాత్రం కలిసే కనిపిస్తున్నారు. ఆరాధ్య స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఐష్, అభిషేక్ ఒకేచోట కనిపించారు. ఇటీవల ఐశ్వర్య అభిషేక్ 49వ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. దీంతో వీరి విడాకుల వార్తలు రూమర్లే అని తేలిపోయాయి.

ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు