Gauthami: నటి గౌతమి కూతురిని చూశారా? ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసినట్లే.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
నటిగా కెరీర్ పీక్స్ లో ఉండగానే సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది గౌతమి. వీరికి ఒక పాప జన్మించగా.. ఆమెకు సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టుకున్నారు. అయితే కూతురు పుట్టిన కొన్నేళ్లకే గౌతమి- సందీప్ విడాకులు తీసుకుని విడిపోయారు.

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించిన గౌతమి తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యే గుర్తింపు తెచ్చుకుంది. శ్రీనివాస కల్యాణం, బెజవాడ రౌడీ, భార్యా భర్తలు, తోడల్లుడు, నేటి చరిత్ర, బామ్మ మాట బంగారు బాట, చైతన్య, అన్నా, చిలక్కొట్టుడు తదితర తెలుగు సినిమాలు గౌతమికి మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఆ తర్వాత కాలంలో సహాయక నటిగానూ మెప్పించింది. మనమంతా, శాకుంతలం, స్కంద, అన్నీ మంచి శకునములే, స్కంద, సింబా, మిస్టర్ బచ్చన్, 35 ఇది చిన్న కథ కాథు వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ పోషించిందీ అందా తార.స
సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. 1998 జూన్ 4న చెన్నైలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వీరికి సుబ్బు లక్ష్మి అనే కుమార్తె పుట్టింది. అయితే పాప పుట్టిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు గౌతమి- సందీప్. దీని తర్వాత 2004 నుంచి 2016 వరకు నటుడు కమల్ హాసన్ తో రిలేషన్ షిప్ లో ఉంది గౌతమి. ఆ తర్వాత ఆ బంధాన్ని కూడా విడిచి పెట్టింది. ఇక క్యాన్సర్ ను జయించిన ఆమె ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటోంది.
గౌతమి కూతురు సుబ్బు లక్ష్మి ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
ఇదిలా ఉంటే ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తన సినిమా ఈవెంట్లకు, ఫంక్షన్లకు న కూతురును కూడా తీసుకొస్తోంది గౌతమి. ఈ నేపథ్యంలో నెటిజన్లు సుబ్బులక్ష్మిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అందంలో తల్లిని మించిపోయిందంటూ సుబ్బుకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక నెట్టింట తన ఫొటోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఇప్పటికే ఉన్నత చదువులను పూర్తిచేసిన ఈ స్టార్ కిడ్ త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








