OTT Movie : ఆలస్యంగా ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
2025 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో పెద్ద స్టార్లు ఎవరూ లేరు. కానీ ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ‘ఛావా’, ‘హౌస్ ఫుల్ 5’ వంటి పెద్ద సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎలాంటి అంచనాలు, హడావిడి, ప్రమోషన్స్, ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా జనాల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

ఓటీటీల పుణ్యమా ని కొత్త సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకు ఓటీటీలోకి సినిమాలు వచ్చేసి ప్రేక్షకులను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదలవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం థియేటర్స్ లో విడుదలై ఆతర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్స్ లో దుమ్మురేపిన ఓ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా హిట్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది ఈ హారర్ సినిమా.. ఇంతకూ ఈ సినిమా ఏదంటే..
అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది
ఇతర భాషల్లో విడుదలైన సినిమాలు కూడా మన దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. మొదటి ఓ భాషలో విడుదలై అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగానే మరికొన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. గతంలో కాంతార సినిమా కూడా అలా వచ్చిందే. ఇక ఇప్పుడు అలాగే కన్నడ భాష నుంచి వచ్చిన ఓ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమానే సు ఫ్రమ్ సో .. నేడు ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఆసల్యం అయ్యింది. ఈరోజు రాత్రిలోగా ఓటీటీలో సు ఫ్రమ్ సో వస్తుందని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
సు ఫ్రమ్ సో సినిమాకు జె.పి. తుమినాద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో హీరోగా కూడా నటించారు. ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి నిర్మాతగా వ్యవహరించారు. కర్ణాటకలోని ఒక ప్రశాంతమైన తీరప్రాంత గ్రామంలో సాగే కథ ఇది. గ్రామంలో అశోక్ అనే బాలుడికి సులోచన అనే దెయ్యం పట్టిందని గ్రామస్తులు నమ్ముతారు. ఆతర్వాత జరిగే పరిణామాలు ఈ సినిమాలో చూపించారు. ఆద్యంతం కామెడీతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇందులో షానిల్ గౌతమ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాద్ కీలకపాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు తుమినాద్. ఇక ఈ సినిమా జీయో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను రూ. 5కోట్లతో రూపొందించారు. కాగా రూ. 120కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా.
బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?
Official OTT DATE! #SuFromSo 🎬
Biggest Blockbuster • ( 2025 )🔥
September 5th : JioHotstar ( Kan )🍿 Expected : Tamil , Tel , Mal , Hin 🔊 pic.twitter.com/s6J2o6sDqJ
— Տri Bobby (@Bobby__Sri) September 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








