AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నాల్లు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈహీరో.. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేయనున్నాడు.

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
Dulquer Salmaan
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2025 | 10:17 AM

Share

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ మలయాళ స్టార్ హీరో మమ్ముటి కొడుకు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా దుల్కర్ దగ్గరయ్యాడు. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో.. ఆతర్వాత మహానటి సినిమాతో మెప్పించాడు. ఇక సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మలయాళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. ఇటీవలే కల్కి సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు. అలాగే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేసి హిట్ అందుకున్నాడు. లక్కీ భాస్కర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

తాజాగా దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ హీరోయిన్ గురించి దుల్కర్ మాట్లాడుతూ.. ఆమె నా చెల్లి అని అన్నారు. ఇంతకూ దుల్కర్ చెల్లి అని పిలిచింది ఏ హీరోయిన్నో తెలుసా..?మళయాళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.. ఆమె ఎవరో కాదు అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్. అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ చిన్నది.ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

రీసెంట్ గా కొత్త లోక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కళ్యాణి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌హీరో థ్రిల్లర్ ఇది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.. మొదటి రోజు రూ.2.7 కోట్ల ఓపెనింగ్‌తో మొదలయ్యింది. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. కళ్యాణి ప్రియదర్శిని నాకు చెల్లెలు లాంటిది. నేను కళ్యాణి చాలా సిమిలర్ గా ఉంటాం. నాకు తెలిసి మేమిద్దరం గత జన్మలో కవలపిల్లడం అయి ఉంటాం అన్నారు దుల్కర్. కళ్యాణిలానే  నాకు సేమ్ వర్రీస్, సేమ్ ఇన్ సెక్యూరిటీస్ ఉంటాయి అని అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..