రూపు ‘రేఖ’లు ఏ మాత్రం మారలేదు.. కుర్రభామలకు పోటీ ఇస్తున్న ఆనందం హీరోయిన్
అవకాశాలు లేక సినిమాలకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం.. అవకాశాలు లేక సినిమాలు తగ్గించేశారు.. వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. ఆ అమ్మడి పేరు రేఖ. ఈ బ్యూటీ తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం చాలా మంది సీనియర్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కొంతమంది భామలు అమ్మ, అక్క, వదిన , అత్త పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మీరా జాస్మిన్, లయ, లైలా, స్నేహా, రాశీ లాంటి హీరోయిన్స్ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది మంచి అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడదామని చూస్తున్నారు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. తెలుగులో ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకలకు దగ్గరైంది. కర్నాటకకు చెందిన ఆమె 2001లో శ్రీనువైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రేఖ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఆనందం తర్వాత జాబిలి చిత్రంలో కనిపించింది. నందమూరి తారకరత్న సరసన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్ కావడంతో రేఖ క్రేజ్ మారిపోయింది. తెలుగులో దొంగోడు, జానికి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకుందాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు చిత్రాల్లో నటించింది. 2008లో నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కన్నడలో సెటిల్ అయ్యింది.
ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే
ఆ మధ్య ఓ సారి టీవీ షోలో పాల్గొంది ఈ చిన్నది.అప్పుడు ఆమె అనారోగ్యం కారణంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆమె కోలుకుంటుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొంది రేఖ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో రేఖ చాలా అందంగా కనిపించింది. నడుము అందాలతో మతిపోగొట్టింది రేఖ. ఆనందం సినిమా సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది రేఖ. తాజాగా రేఖ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








