అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. నిర్మాతతో సీక్రెట్ మ్యారేజ్.. కట్ చేస్తే ఇప్పుడు నెట్టింట అరాచకం
టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా మాయమైన హీరోయిన్ పదుల సంఖ్యలో ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుంటే.. మరికొంతమంది ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకప్పుడు కుర్రాళ్లను తన అందంతో కట్టిపడేసింది.

హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించడం అందరివల్లా కాదు.. గుమ్మడికాయంత అందం ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ప్రతిభ ఎంత ఉన్నా అవకాశాలు కూడా రావాలి. ఒకప్పుడు రాణించి ఆతర్వాత కనిపించకుండా మాయమైన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. తమ అందంతో నటనతో వావ్ అనిపించిన హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమందైతే జనాలకు గుర్తు కూడా లేరు.. కొందరు భామలు సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులను అడపాదడపా పలకరిస్తున్నారు. పైన కనిపిస్తున్న అందాల భామ కూడా ఒకానొక సమయంలో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. తన క్యూట్ స్మైల్ తో నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు సినిమాలకు దూరమైపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన సోయగాలతో సెగలు పుట్టిస్తుంది.
పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా
చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో పూనమ్ బజ్వా ఒకరు. నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాలో నటించారు. ఆతర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది.
ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే
ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ‘ఓం త్రీడి’ సినిమాను తెరకెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్ కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. దీని పై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందాలతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ..
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








