ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగ బ్రో..! థియేటర్లు బ్లాస్ట్ పక్కా..!! స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా స్టార్ హీరో..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది.. అలాగే కల్కి సినిమా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చేస్తుంటే మెంటలెక్కుతుందిగా.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన హిట్ తో ప్రభాస్ స్పీడ్ పెంచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో అభిమానులకు మంచి మీల్స్ పెట్టాడు ప్రభాస్. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసేలోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
ఇదిలా ఉంటే ఇప్పుడు స్పిరిట్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాను పవర్ ఫుల్ కథతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇందుకోసం మెగాస్టార్ ను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి. యానిమల్ సినిమాలో రణబీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించి మెప్పించారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాలోనూ హీరో తండ్రి పాత్ర హైలైట్ గా ఉంటుందని తెలుస్తుంది. అందుకోసం చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








