మహేష్ అన్న కొడుకు హీరోయిన్ దొరికేసింది.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురిని దింపుతున్నారుగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా హీరోగా పరిచయం అయ్యారు. రమేష్ బాబు హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా రమేష్ బాబు 17 సినిమాల్లో నటించారు. కృష్ణ తో కలిసి నటించిన ఎంకౌంటర్ సినిమానే నటుడిగా ఆయన చివరి సినిమా. ఆ తర్వాత నిర్మాతగా మారారు రమేష్ బాబు. నిర్మాతగా నాలుగు సినిమాలు చేశారు. హిందీలో సూర్య వంశం సినిమా నిర్మించారు. ఆ తర్వాత మహేష్ నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. రమేష్ బాబుకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రమేష్ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే జయకృష్ణ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కదా సినిమా అంటే.! 8 రోజులు షూటింగ్.. రూ. 52లక్షల బడ్జెట్..!! రూ.2100కోట్లు వసూల్ చేసింది..
జయకృష్ణ బాధ్యతను మహేష్ బాబు తీసుకున్నారు. ఆ యంగ్ హీరోను లాంచ్ చేయడం కోసం మహేష్ పక్క ప్లాన్ సెట్ చేశారు. జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న అజయ్ ఇప్పుడు అదిరిపోయే కథతో రెడీగా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. అలాగే ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జయకృష్ణకు జోడీగా నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.
యంగ్ హీరోలను వదిలేసి.. సీనియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కుర్ర భామ.. చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయనతో..
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించిన రవీనా టాండన్ కూతురు రషా టాండానీ ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ పరిచయం చేయనున్నారని తెలుస్తుంది. ఈ చిన్నది బాలీవుడ్ లో ఆజాద్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు రషా టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. అలాగే ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.
అందంలో అప్సరస.. అదృష్టం మాత్రం లేదు.. 9 సినిమాలు చేస్తే 8ఫ్లాప్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




